Begin typing your search above and press return to search.

ఆ భారీ రీమేక్ మూవీకి డైరెక్టర్ మారబోతున్నాడా..??

By:  Tupaki Desk   |   15 July 2020 3:20 PM IST
ఆ భారీ రీమేక్ మూవీకి డైరెక్టర్ మారబోతున్నాడా..??
X
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ తో చేస్తున్న సినిమా తరువాత స్టార్ హీరో నటించే సినిమా.. మలయాళ సూపర్ హిట్ రీమేక్ సినిమా. ఇప్పటికే ఆ సూపర్ హిట్ సినిమా తెలుగు హక్కులను ఓ స్టార్ హీరో నిర్మాణ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఆ మధ్య ముసుగులో గుద్దులాటలా ఉన్న దర్శకుడి విషయాన్నీ తేల్చేసారు. అయితే భారీ రీమేక్ మూవీని డైరెక్ట్ చేయడానికి కొందరు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా చివరికి ఓ యంగ్ డైరెక్టర్ ఓకే అయ్యాడు. ఆ విషయం స్వయంగా హీరో కూడా సోషల్ మీడియాలో తెలిపారు. ఇక స్టార్ హీరోతో సినిమా అనేసరికి ఆ యంగ్ డైరెక్టర్ ఇన్నిరోజుల నుండి రీమేక్ సినిమా తెలుగు స్క్రిప్ట్ తయారు చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో ఆ స్క్రిప్ట్ విషయంలో కొన్ని కీలక సూచనలు కూడా చేశారు స్టార్ హీరో. కానీ మళ్లీ ఈ భారీ రీమేక్ సినిమాకి డైరెక్టర్ మారే సూచనలు కనిపిస్తున్నాయని సినీవర్గాలలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

మరి మొదట్లోనే స్టార్ డైరెక్టర్లను కాదని యంగ్ డైరెక్టర్ కి బాధ్యతలు అప్పగించిన హీరో, నిర్మాత.. ప్రస్తుతం ఆ యంగ్ డైరెక్టర్ స్థానంలో సీనియర్ డైరెక్టర్ బెటర్ అని ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోతో సినిమా అనేసరికి ఆ డైరెక్టర్ తన పెళ్లి కూడా ఈ భారీ సినిమా తర్వాతే అని చెప్పాడు. స్క్రిప్ట్ రెడీ చేయడంలో నిమగ్నమైన ఆ యువ డైరెక్టరుకి ఓ ఖంగు తినే వార్త ఎదురైందని అంటున్నారు. ప్రస్తుతం అనుకున్న డైరెక్టర్ స్థానంలో ఆయనకు ఇదివరకే మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ వైపు హీరో మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి ఈ యువ డైరెక్టర్ స్క్రిప్ట్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా.. లేక స్క్రిప్ట్ నచ్చలేదా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి లేనప్పుడు మొదట్లోనే ఆ డైరెక్టర్ ఫిక్స్ కాదని చెప్పాల్సింది. వీడియో కాల్స్ లో కూడా స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయట. మరి ఇంతకీ ఈ రీమేక్ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పాలి. దీని పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.