Begin typing your search above and press return to search.

ఆ హీరో విషయంలో బడా నిర్మాత ముందే జాగ్రత్తపడుతున్నాడా..??

By:  Tupaki Desk   |   4 Jun 2021 9:00 AM IST
ఆ హీరో విషయంలో బడా నిర్మాత ముందే జాగ్రత్తపడుతున్నాడా..??
X
కొన్నిసార్లు చిత్రపరిశ్రమలో రిలీజ్ అయినటువంటి సినిమాలు వెంటనే ఎంతవరకు వసూల్ చేయగలుగుతుంది అనేది అంచనా వేయలేము. కానీ ఎంతవరకు వసూల్ చేస్తే హిట్ అవుతుంది అనేది మాత్రం అంచనా వేస్తుంటారు. అయితే కొన్నిసార్లు సినిమా ట్రైలర్ అదిరిపోయినా సినిమాలో ఏదైనా లోటు కనిపిస్తే మాత్రం వసూళ్లు రాబట్టడం కష్టమే. అలాగని ట్రైలర్ బాలేకపొతే సినిమాలు ఆడవనే రూల్ కూడా లేదు. సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఎవరు ఆపలేరు. అలాంటి సినిమాలకు జనాలు వద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తారు.

విడుదలైన ప్రారంభంలో ఎంత జోరు చూపించినా తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టే అవకాశం అన్ని సినిమాలకు ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసినా స్టార్స్ తో ప్రమోషన్స్ చేయించినా సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా లేకపోతే ఆ సినిమాను ఎవరు హిట్ చేయించలేరు. టాలీవుడ్ మేటి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడుగా 'తెల్లవారితే గురువారం' అనే సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నంగా డార్క్ కామెడీ థ్రిల్లర్ 'మత్తువదలరా' అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన శ్రీసింహా రెండో సినిమాగా 'తెల్లవారితే గురువారం' చేసాడు.

మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న శ్రీసింహా రెండో ప్రయత్నంగా రొమాంటిక్ లవ్ స్టోరీతో వచ్చాడు. కానీ సినిమాలో ఏదో లోపించడం కారణంగా సినిమా ప్లాప్ అయింది. అయితే ప్రస్తుతం శ్రీసింహా మూడో సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఏంటంటే.. ఈ హీరో తదుపరి సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే తెల్లవారితే గురువారం సినిమా ప్లాప్ అవ్వడంతో నిర్మాత సురేష్ బాబు తమ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్. అందుకే ఈసారి తమ నిర్మాణంలో ప్లాప్ అనే మాట రాకూడదని స్క్రిప్ట్ విషయంలో మార్పులు సూచించి.. బడ్జెట్ విషయంలో కూడా ఓ ప్రణాళిక రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.