Begin typing your search above and press return to search.

ఆ బిగ్గెస్ట్ హిట్ మూవీ చైనాలో రీమేక్ కానుందా..?

By:  Tupaki Desk   |   10 Jun 2020 9:10 AM GMT
ఆ బిగ్గెస్ట్ హిట్ మూవీ చైనాలో రీమేక్ కానుందా..?
X
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలలో రీమేక్ సినిమాల జోరు బాగా పెరిగింది. దర్శక నిర్మాతలు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. ఓ విధంగా ఈ రీమేక్ ల విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంది. సూపర్ హిట్టైన సౌత్ ఇండియన్ సినిమాల అన్నింటి మీద వెంటనే కర్చీఫ్ ఏసేస్తుంది. అయితే మన సినిమాలు మనదేశంలో ఇతర భాషల్లో రీమేక్ అవడం సాధారణ విషయమే. అలాగే విదేశీ బాషల సినిమాలు.. అంటే ఫ్రెంచ్ సినిమాలు.. కొరియన్ సినిమాలు ఇండియాలో రీమేక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కానీ మన సినిమాలను ఇతర దేశాల రీమేక్ చేసినట్లు వచ్చిన వార్తలు చాలా తక్కువ. తాజాగా సౌత్ ఇండియన్ హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రం చైనాలో రీమేక్ అవుతుందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అసురన్ సినిమా తమిళనాట బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి చాలామంది ముందుకొచ్చారు. ప్రస్తుతం తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియమణి వెంకటేష్ భార్యగా కనిపించనుంది.

అయితే చైనాలో రీమేక్ అవుతుందంటూ వస్తున్న వార్తల పై అసురన్ నిర్మాత కలైపులి ఎస్. థాను క్లారిటీ ఇచ్చారు. అసురన్ సినిమా చైనాలో రీమేక్ అవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా బయటికి వచ్చిందో మాకు తెలియదని ఆయన అన్నారు. అంతేగాక చైనా నుండి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేరని, అందువల్ల ఆ వార్తని నమ్మవద్దని కోరాడు. ఇకపోతే తెలుగులో రీమేక్ అవుతున్న ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే కన్నడలో హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి ధనుష్ నటించిన అసురన్ ఇతర దేశాలకు పుకార్ల ద్వారా పాకడం ఆనందంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.