Begin typing your search above and press return to search.

ఆ మెగా రీమేక్ ఇంకా స్క్రిప్టు రెడీ కాలేదా?

By:  Tupaki Desk   |   21 April 2021 4:13 PM IST
ఆ మెగా రీమేక్ ఇంకా స్క్రిప్టు రెడీ కాలేదా?
X
ఒక సినిమా త‌ర‌వాత ఒక‌టి కూల్ గా చేయ‌డం ఒక ఎత్తుగ‌డ‌. అలా కాకుండా లాక్ డౌన్ స‌మ‌యంలో ఒకేసారి నాలుగు సినిమాల్ని ప్ర‌క‌టించారు మెగాస్టార్ చిరంజీవి. న‌వ‌త‌రం హీరోల‌కు ఏమాత్రం తీసిపోని స్పీడ్ చూపించారు. త‌న త‌దుప‌రి చిత్రాల‌కు ప‌ని చేస్తున్న న‌లుగురు ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేయ‌డ‌మే గాక వారితో బౌండ్ స్క్రిప్ట్ కోసం వ‌ర్క్ చేయించారు చిరు.

అందులో లూసీఫ‌ర్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రానికి త‌ని ఒరువ‌న్ ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. `రారాజు`- `కింగ్ మేక‌ర్‌` అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్ కంటే భిన్నంగా తెలుగు ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును రెడీ చేశారు మోహ‌న్ రాజా. అయితే అది చిరుకి వంద‌శాతం న‌చ్చ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో ప‌దే పదే క‌రెక్ష‌న్స్ చేయిస్తున్నార‌ట‌.

కార‌ణం ఏదైనా లూసీఫర్ రీమేక్ ఆల‌స్య‌మ‌వుతోంది. ఏప్రిల్ తొలివారంలో ప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. స్క్రిప్టు ప‌రంగా కొన్ని దిద్దుబాట్ల‌తో పాటు సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గాల్సి ఉంటుంది. అందుకే ఇప్ప‌టికీ ఆల‌స్యం చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలోని ఆచార్య‌ను పూర్తి చేయాల‌ని చిరు కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. సెకండ్ వేవ్ వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిన‌దే.

అయినా ఒక భాష‌లో తెర‌కెక్కి విజ‌యం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయాలంటే చాలా స‌వాళ్లు ఉంటాయి. ఫ్లేవ‌ర్ మారిపోతుంద‌న్న భ‌యం ఒక వైపు.. నేటివిటీ స‌మ‌స్య‌లు ఇంకోవైపు.. వీట‌న్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ స్క్రిప్టు రెడీ చేసి మెప్పించ‌డం అంటే ఆషామాషీ కాదు. మోహ‌న్ రాజాకు ఛాన్స్ ద‌క్కినా కానీ.. ప్ర‌స్తుతం చిరును ఒప్పించేందుకు చాలానే చెమ‌టోడ్చాల్సి వ‌స్తోంది.