Begin typing your search above and press return to search.

మెగాస్టార్ నుండి నిజంగా ఆ గుడ్ న్యూస్ వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   8 July 2022 1:30 PM GMT
మెగాస్టార్ నుండి నిజంగా ఆ గుడ్ న్యూస్ వ‌స్తుందా?
X
క‌రోనా దెబ్బ‌కు ప్ర‌స్తుత ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విప‌రీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ మూవీస్ వ‌ర‌కు అన్నీ ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయి. అలాగే థియేటర్‌ లతో పోటీ పడుతూ విభిన్న‌మైన వెబ్ సిరీసుల‌తో ఓటీటీలు జ‌నాల‌ను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ యాప్ ల‌ను చ‌క్క‌గా ఇన్ స్టాల్ చేసేసుకుని జ‌నాలు ఫుల్ గా ఎంట‌ర్టైన్ అవుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల బాట ప‌డుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు, టాక్ షోలు చేస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ లో బాల‌య్య 'ఆహా' వేదిక‌గా 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' అనే టాక్ షో చేసి విశేష ప్ర‌జాదార‌ణ పొందారు. అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ రానా ద‌గ్గుబాటితో క‌లిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'దూత' అనే సిరీస్ ను ప‌ట్టాలెక్కించారు. ఇంకా ఎంద‌రో హీరోలు ఓటీటీలో సంద‌డి చేస్తున్నారు. ఇక హీరోయిన్ల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే కాజ‌ల్, స‌మంత‌, త్రిష‌, శ్రుతి హాస‌న్‌, అమ‌లా పాల్‌, రెజీనా ఇలా ఎంతో మంది తార‌లు ఓటీటీలోకి వ‌చ్చారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ట్రెండ్ ను ఫాలో అవుతూ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నార‌ట‌.

ఓవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ఓటీటీలో స‌త్తా చాటాల‌ని చిరు భావిస్తున్న‌ట్లు తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ మంచి వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నార‌ని.. ఇప్ప‌టికే కొన్ని క‌థలు విన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతేకాదు, త్వ‌ర‌లోనే ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన గుడ్ న్యూస్ సైతం మెగాస్టార్ నుండి రాబోతోంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి నిజంగా ఆ గుడ్ న్యూస్ వ‌స్తుందో.. రాదో.. తెలియ‌దు గానీ.. చిరు ఓటీటీ ఎంట్రీ ప‌ట్ల మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.

కాగా, చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ఇప్పుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో 'గాడ్ ఫాద‌ర్‌', మెహ‌ర్ ర‌మేష్ తో 'భోళా శంక‌ర్‌' చిత్రాలు చేస్తున్నారు. అలాగే బాబీ డైరెక్ష‌న్ లో 'మెగా 154' వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ ను సైతం ఆయ‌న లైన్ లో పెట్టారు.