Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సినిమాతో దర్శకుడు కెరీర్ స్మాష్ కానుందా?

By:  Tupaki Desk   |   19 April 2020 8:00 AM IST
స్టార్ హీరో సినిమాతో దర్శకుడు కెరీర్ స్మాష్ కానుందా?
X
ఆయన పెద్ద స్టార్ హీరో. కొంతకాలం గ్యాప్ తర్వాత రీమేక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈ పాటికే సినిమా రెడీ అయి ఉండేది కానీ కరోనా.. లాక్ డౌన్ ల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ రావడం చాలామంది అదృష్టంగా భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సినిమా దర్శకుడి పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉందట.

దీనికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది.. డైరెక్టర్ బయట బ్యానర్లలో సినిమా చేయకుండా ఈ సినిమా నిర్మాత రకరకాల అగ్రిమెంట్ లతో లాక్ చేశాడట. నిజానికి ఆ ఆబ్లిగేషన్ ఉండడం వల్లే ప్రస్తుతం ఈ స్టార్ హీరో రీ ఎంట్రీ సినిమా దర్శకత్వ అవకాశం తన చేతికి వచ్చిందట. అంతే కాకుండా స్టార్ హీరోకి సన్నిహితుడైన మరో స్టార్ డైరెక్టర్ సిఫార్సు కూడా ఉందట. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కత్తి మీద సామే అని అంటున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించే అవకాశాలు దాదాపు శూన్యం అని ఇప్పటికే ఇండస్ట్రీ లో టాక్ ఉంది. సీరియస్ యాక్షన్ ఫార్మాట్లో వెళ్ళవలసిన ఈ సినిమాకి అక్కర్లేని సీన్లు.. ఐటెం సాంగ్ జోడించారని ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ కు వచ్చిన సమస్య ఏంటంటే ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మాత్రం ఇవ్వరు. ఆ క్రెడిట్ హీరోగారి ఖాతాలోనో లేకపోతే ఒరిజినల్ సినిమా ఖాతాలోనో పడిపోతుంది. అదే ఫ్లాప్ అయితే మాత్రం దానికి కారణం డైరెక్టర్ అంటూ హీరోగారి అభిమానులు ప్రచారం మొదలు పెడతారు. వీలైతే తలంటుతారు. ఇదంతా జరిగితే మరో స్టార్ హీరోతో లైన్ లో ఉందని ప్రచారం సాగుతున్న సినిమాకు కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది.

ఈ దర్శకుడు గతంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తే ఒకటి మాత్రం హిట్ గా నిలిచింది. అయితే ఆ విజయానికి ఇతనికి ఏమాత్రం క్రెడిట్ దక్కలేదు. సగం క్రెడిట్ హీరో గారి ఖాతాలోకి పోతే.. మిగతా సగం కాస్త నిర్మాత ఖాతాలోకి వెళ్లి పోయింది. అందుకే ఇప్పటికీ ఈ డైరెక్టర్ కి పెద్దగా బ్రాండ్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు కనుక సదరు స్టార్ హీరో గారి రీ ఎంట్రీ సినిమా అటు ఇటు అయితే ఈ దర్శకుడిని ఆడిపోసుకునే జనాలు ఎక్కువగా ఉంటారు. ఇలా జరిగితే ఈ దర్శకుడి కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినా ఆశ్చర్య పోనవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఆ డైరెక్టర్ బయటపడాలంటే ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి. అంతేకాదు.. ఆ సక్సెస్ క్రెడిట్ కూడా తన ఖాతాలో పడాలని గట్టిగా కోరుకోవాలి.