Begin typing your search above and press return to search.

RRR లో తార‌క్ సెకండ్ హీరోనా?

By:  Tupaki Desk   |   28 March 2022 6:08 AM GMT
RRR లో తార‌క్ సెకండ్ హీరోనా?
X
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం RRR విడుదలైంది. బంప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముగ్గురు Rల‌కు పేరొచ్చింది. అయితే కొంద‌రికి ఎక్కువ.. కొంద‌రికి త‌క్కువ! అన్న‌దే ఇప్పుడు ఇష్యూ. ఈ సినిమాలో తార‌క్ కంటే చ‌ర‌ణ్ కి ఎక్కువ ఎలివేష‌న్ సీన్స్ ఉన్నాయ‌న్న చర్చ న‌డుమ తార‌క్ అసంతృప్తిగా ఉన్నారంటూ గుస‌గుస‌లు స్ప్రెడ్ చేస్తున్నారు.

నిజానికి ఫైన‌ల్ ఔట్ పుట్ తో తార‌క్ అంత సంతృప్తిగా లేరని త‌న‌కు సంబంధించిన ఎలివేష‌న్ సీన్స్ ని క‌ట్ చేశార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. దీంతో ఇంట‌ర్వెల్ అనంత‌రం ప్రీమియ‌ర్ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తార‌క్ కాస్త ఆందోళ‌న‌గా క‌నిపించారంటూ మ‌సాలాను కూడా అద్దారు. ఎన్టీఆర్ నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు. అతను వేరే ఏ సినిమా చేయలేదు. ఈ సినిమా కోసం తన జీవితంలో కీల‌క‌మైన నాలుగు సంవత్సరాలు ఇచ్చేశాడు. అయితే ఆఖరికి ఆయన అభిమానులు దీంతో అసంతృప్తిగానే ఉన్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎన్టీఆర్ ని పక్కకు తప్పించినట్లు అభిమానులు నిరాశ చెందుతున్నార‌ట‌. అభిమానులే కాదు ఎన్టీఆర్ కూడా కంగారుపడ్డారని ఒక గుస‌గుస బ‌లంగా వినిపిస్తోంది.

దీనికి ఆధారాలను కూడా ఉదహరిస్తున్నారు. రిలీజ్ రోజు సినిమా చూసి ఎన్టీఆర్ ఏఎంబీ మాల్ నుంచి బయటకు వచ్చాడు. అతను నిస్తేజంగా క‌నిపించాడు. అతను తన అశాంతిని చుట్టుపక్కల వారు గ‌మ‌నించేశారు. కొందరి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయన అలా భావించారనేది టాక్. నిజానికి ప్ర‌ధాన తారాగ‌ణం రాజమౌళితో పాటు సినిమాకు సంబంధించిన కొందరు కీలక వ్యక్తులు బ్రేక్ ఫాస్ట్ కోసం డ్రైవ్ ఇన్ కి వెళ్లాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. అతను థియేటర్ సందర్శనకు కూడా హాజరు కావాల్సి ఉంది కానీ అతను రాలేదు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మొదటి రోజు తర్వాత సైలెంట్ అయిపోయారు. రామ్ చరణ్ ని ఎలివేట్ చేయడానికి తీసిన సినిమా ఇద‌ని భావించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడం లేదు. నిజానికి డబ్బింగ్ సమయంలోనే సినిమాలో ఏముందో తార‌క్ కు తెలుసు. ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎన్టీఆర్ ను ఎలివేట్ చేసే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రం నుండి కట్ చేసి ఉండవచ్చు అని సందేస్తున్నారు. పాతిక నిమిషాల కోత‌లో తార‌క్ సీన్లు ఎక్కువ పోయాయ‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. లేదంటే థియేటర్ లో ఫస్ట్ షో చూసి ఎన్టీఆర్ నిరాశ చెందడానికి కారణం ఇంకేది అయ్యి ఉంటుంది? అన్న చ‌ర్చా సాగుతోంది.

చ‌ర‌ణ్ త‌ర‌హాలోనే తార‌క్ కూడా పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆశించాడు. అందుకు త‌గ్గ‌ట్టే క్లైమాక్స్ పార్ట్ లో రామ్ చరణ్ కి ఇచ్చిన రాముడు గెట్ అప్ ఉత్తర భారతదేశంలో అతని ఇమేజ్ కి చాలా ఊపునిస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ క్యారెక్టర్ గ్రాఫ్ ఫ్లాష్ బ్యాక్ .. ఇన్ సైడ్ స్టోరీ పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుంది. అయితే ఎన్టీఆర్ పాత్ర సాదాసీదాగా దాదాపు సెకండ్ హీరోలా ఉంటుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. తార‌క్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కి ట్రిపుల్ ఆర్ ఎంత‌మాత్రం క‌లిసి రాద‌న్న చ‌ర్చా సాగుతోంది. అయితే ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న‌కు మాత్రం ఎవ‌రూ పేరు పెట్ట‌లేదు. అత‌డికి ద‌క్కాల్సిన ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అయితే తార‌క్ అభిమానుల్లో కొంద‌రి వెర్ష‌న్ వేరొక విధంగా ఉంది. నిజానికి తార‌క్ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొన్నాడు. అనంత‌రం త‌న భార్యామణి ప్ర‌ణ‌తి బ‌ర్త్ డే వేడుక‌లు చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌ల్లోనూ ఎంతో చిల్ అయ్యాడు. ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ ని అత‌డు ఆస్వాధిస్తున్నాడు. కొన్నేళ్ల త‌ర్వాత ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో స‌మ‌యం దొరికింది. దానిని పూర్తిగా ఆస్వాధిస్తున్నాడు. అందుకే నిర్మాత దాన‌య్య ఏర్పాటు చేసిన పార్టీకి రాక‌పోయి ఉండొచ్చు అంటూ స‌మ‌ర్థిస్తున్నారు. పైగా త‌న స్నేహితుడు త‌నకు ప్రాణ స‌మాన‌మైన చ‌ర‌ణ్ పాత్ర హైలైట్ అయితే తాను త‌గ్గిన‌ట్టుగా భావించేంత త‌క్కువ క్యారెక్ట‌ర్ తార‌క్ ది కాదు.. అన్న బ‌ల‌మైన స‌మ‌ర్థింపు మ‌రో కోణంలో ఉంది.