Begin typing your search above and press return to search.

తమన్నా సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోందా...?

By:  Tupaki Desk   |   18 July 2020 11:00 AM IST
తమన్నా సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోందా...?
X
మిల్కీ బ్యూటీ తమన్నా 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2014లో హిందీలో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'క్వీన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. 'క్వీన్'లో కంగన రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో తమన్నా భాటియా పోషించారు. అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తిమంత‌మైన మ‌హిళగా మారుతుంది అనే కాన్సెప్ట్ లో 'ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి' ఉండబోతోంది. ఈ సినిమాని ముందుగా నీలకంఠ దర్శకత్వంలో స్టార్ట్ చేసారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ప్రశాంత వర్మ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ మధ్య రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతుండటంతో 'ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి' ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అందుకోసం ఇప్పటికే ప్రముఖ ఓటీటీలతో చర్చలు జరుపుతున్నారట. మంచి డీల్ కుదిరితే త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగున్నాయట.

కాగా ఈ చిత్రంలో తమన్నాతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, శిబాని దండేకర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందించగా మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి' చిత్రాన్ని మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌ లో మ‌ను కుమారన్ నిర్మించారు. ఇక 'క్వీన్' సినిమాని మలయాళంలో నీలకంఠ దర్శకత్వంలో మంజిమా మోహన్ కథానాయికగా 'జామ్ జామ్' అనే పేరుతో రీమేక్ చేసారు. ఇదే సినిమా తమిళ్ లో 'పారిస్ పారిస్' పేరుతో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రమేష్ అరవింద్ తెరకెక్కించారు. కన్నడ వెర్షన్‌‌ 'బటర్ ఫ్లై' కి కూడా రమేష్ అరవిందే దర్శకత్వం వహించగా పారుల్ యాదవ్ హీరోయిన్ గా నటించింది.