Begin typing your search above and press return to search.

ఈ సినిమాలపై సమ్మర్ ఆధారపడి ఉందా..??

By:  Tupaki Desk   |   7 April 2021 5:00 AM IST
ఈ సినిమాలపై సమ్మర్ ఆధారపడి ఉందా..??
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇదివరకే కరోనా అంతరించిపోయి అంతా మాములు స్థితికి చేరబోతుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ రోజురోజుకి వేల సంఖ్యలలో కరోనా కేసులు నమోదు అవుతుండటం సినీఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఇకపై కరోనా లాక్డౌన్ మరోసారి అమలయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనాను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ బంద్ అవ్వడమే కాకుండా లాక్ డౌన్ కూడా అమలులో ఉంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఏపీ, తెలంగాణలో కూడా త్వరలోనే ప్రభుత్వాలు ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. ఓవైపు కరోనా కలకలం రేపుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ దగ్గరపడింది.

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ వీక్ విజయవంతంగా ప్రదర్శితం అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు వకీల్ సాబ్ సెకండ్ వీక్ లో నడవడం పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ తర్వాత నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 16న నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' విడుదల కాబో్తుండగా.. ఆ తర్వాత వారం ఏప్రిల్ 23న నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మరి వకీల్ సాబ్ తర్వాత కరోనా ఎఫెక్ట్ ను ఈ రెండు సినిమాలపై భారీగా పడనుంది. ఈ విషయంలో నాగచైతన్య, నాని ఇద్దరూ కూడా కంగారు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇకపై రాబోయే సినిమాలన్ని ఈ రెండు సినిమాల ఫలితం పై ఆధారపడి ఉన్నాయి. వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత అటు లవ్ స్టోరీ.. ఇటు టక్ జగదీష్ సినిమాలపై క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే థియేటర్స్ లో 50% సీటింగ్ పై చర్చలు నడుస్తున్నాయి. అదేగాని జరిగితే సమ్మర్ సినిమాలన్ని వాయిదాపడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో!