Begin typing your search above and press return to search.

ఈ సమయంలో స్టార్‌ వార్‌ అవసరమా?

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 AM GMT
ఈ సమయంలో స్టార్‌ వార్‌ అవసరమా?
X
కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అన్నాత్తే సినిమా దీపావళి సందర్బంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. కరోనా కారణంగా థియేటర్లు ఓపెన్‌ లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో షూటింగ్‌ పూర్తి అయిన అన్నాత్తే ను దీపావళి కానుకగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో అన్నాత్తే కోసం అభిమానుల ఎదురు చూపులు మొదలు అయ్యాయి. అభిమానులు కౌంట్‌ డౌన్ మొదలు పెట్టారు. ఈ సమయంలో తమిళ మరో స్టార్‌ అజిత్ నటిస్తున్న వాలిమై ను కూడా దీపావళికి విడుదల చేస్తారనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. నవంబర్‌ మొదటి వారంలోనే వాలిమై అంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా డేట్ మాత్రం ప్రకటించలేదు.

శివ దర్శకత్వంలో రజినీకాంత్‌ నటించిన అన్నాత్తే సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఇక హెచ్ వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వాలిమై ను కూడా నవంబర్‌ మొదటి వారంలోనే అంటూ వార్తలు వస్తున్న కారణంగా ఇద్దరు స్టార్‌ హీరోల మద్య పోటీ తప్పదేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అజిత్ తో పలు సినిమాలు తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ లను శివ దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే శివ దర్శకత్వంలో రజినీకాంతో అన్నాత్తే ను చేశాడు. కనుక ఒక సారి ఈ రెండు సినిమాలు విడుదల అయితే మాత్రం ఖచ్చితంగా ఓ రేంజ్ లో రచ్చ రంబోలా తప్పదంటూ అభిమానులు ఇప్పటి నుండే ఒకింత ఆందోళన మరింత ఆసక్తితో ఉన్నారు.

ఈ రెండు సినిమాలు ఒకే సారి విడుదల అవుతాయి అంటూ వస్తున్న వార్తలు నిజం అయ్యి ఉండక పోవచ్చు అంటున్నారు. ఎందుకంటే అసలే కరోనా సమయం.. నవంబర్‌ లో థర్డ్‌ వేవ్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో స్టార్‌ వార్ అస్సలు జరిగే అవకాశం లేదు అంటున్నారు. ఒక వేళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా స్టార్స్ ఇద్దరు కూడా సామరస్యంగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా కనీసం పది రోజుల నుండి రెండు వారాల గ్యాప్ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని ఇద్దరు హీరోల ప్లాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.