Begin typing your search above and press return to search.

'సైజ్ అంత ముఖ్యమా..?' అంటూ 'ఏక్ మినీ కథ' న్యూ పోస్టర్ రిలీజ్!

By:  Tupaki Desk   |   27 March 2021 9:52 AM GMT
సైజ్ అంత ముఖ్యమా..? అంటూ ఏక్ మినీ కథ న్యూ పోస్టర్ రిలీజ్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో యువి క్రియేష‌న్స్ బ్యానర్ పై మంచి అభిప్రాయాలు ఏర్పరచుకుంది. బడ్జెట్ విషయంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ అంటూ సినిమాలు నిర్మిస్తోంది యూవి. ‘మిర్చి’ నుండి ‘రాధేశ్యామ్’ అన్ని క‌థ‌లను న‌మ్మి మాత్రమే ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. అయితే యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో కొత్త సినిమా వ‌స్తుందంటే ఖచ్చితంగా కథపరంగా బాగుంటుందని ఎక్సపెక్ట్ చేస్తారు. ఇప్ప‌డు యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యూవి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూవి కాన్సెప్ట్ ద్వారా ఫస్ట్ సినిమా 'ఏక్ మినీ కథ'ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

యువహీరో సంతోష్ శోభన్, కావ్యతపర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ‘ఏక్ మినీ క‌థ’ సినిమాతో కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 'Does Size Matter' అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా టిషర్ట్స్ పై కూడా 'డస్ ఇట్ మేటర్' అనేది చూస్తే సినిమా నేపథ్యం ఇట్టే తెలిసిపోతుంది. అలాగే హీరో సంతోష్ సైజ్ చిన్నగా చూపించడం, హీరోయిన్ కావ్య చేతితో బిగ్ సైజ్ కావాలంటూ చూపించడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కథ హీరో ప్రైవేట్ పార్ట్ చిన్నగా ఉండటం వలన ఎదుర్కొనే సమస్యల చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.