Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' కథ.. ఆ హిట్ సినిమా కాపీ నా!

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 PM GMT
సర్కారు వారి పాట కథ.. ఆ హిట్ సినిమా కాపీ నా!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మహేష్ చేయబోయే కొత్త సినిమా ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ కొత్త సినిమాకు 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. అసలు పరశురామ్ - మహేష్ బాబుల కాంబినేషన్ కొత్తగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. కానీ టైటిల్ అయితే అందరి అంచనాలు అందుకుందని చెప్పవచ్చు. ఇటీవల ఈ సినిమాను చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో హీరో తన తండ్రిపై పడ్డ నిందలను చెరిపేందుకు చేసే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా తెలుగులో ఇలాంటి కథలు మనం చాలానే చూశాం. సన్ ఆఫ్ సత్యమూర్తి స్టోరీ కూడా దాదాపు అలాంటి లైన్ తోనే రన్ అవుతుందని తెలిసిందే. తండ్రి మీద పడ్డ నిందలు చెరిపేయడానికి కొడుకు పడిన కష్టాలే ఆ సినిమా. మరి అదే లైన్ అప్ తో ఈ సర్కారు వారి పాట తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. మరో కథ కూడా వినిపిస్తుంది.. వేలం వేసిన ఆస్తులను హీరో ఎలా దక్కించుకున్నాడు అనేది మెయిన్ కథ అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి మహేష్ అయితే ఈ సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నానని ప్రకటించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.