Begin typing your search above and press return to search.

సక్సెస్‌ తో సామ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌?

By:  Tupaki Desk   |   13 Jun 2021 11:30 AM GMT
సక్సెస్‌ తో సామ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌?
X
టాలీవుడ్‌ స్టార్‌ హాట్‌ ముద్దుగుమ్మలు తమన్నా మరియు కాజల్‌ లు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చారు. కాని సమంత మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో సక్సెస్ ను దక్కించుకుంది. భారీ ఎత్తున అంచనాలున్న ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 పై వివాదం రాజుకున్నా కూడా మెల్లగా హిందీ భాషలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులు మొదటి సారి సమంత నటనకు ఫిదా అవుతున్నారు. ఆ వెబ్‌ సిరీస్ లోని రాజీ పాత్రతో పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్‌ ను సమంత దక్కించుకుంది. దాంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కు గాను సమంత తీసుకున్న పారితోషికంకు రెట్టింపు పారితోషికంను నెట్‌ ఫ్లిక్స్‌ వారు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. ఒక లేడీ ఓరియంటెడ్‌ వెబ్‌ సిరీస్ లో సమంతను నటింపజేసేలా వారు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు ఇప్పటికే రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను నెట్‌ ప్లిక్స్ వారు సొంతంగా నిర్మించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వెబ్‌ సిరీస్ లో సమంత ను నటింపజేసేలా వారు ప్లాన్‌ చేస్తున్నారు. భారీ అంచనాలున్న వెబ్‌ సిరీస్ తో సమంత మళ్లీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్తుందేమో చూడాలి.

తెలుగులో ప్రస్తుతం ఈమె శాకుంతలం సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. అది కాకుండా మరో రెండు ప్రాజెక్ట్‌ లు కూడా చర్చల దశలో ఉన్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న శాకుంతలం సినిమా 50 శాతం వరకు షూటింగ్‌ పూర్తి అయ్యిందని ఇటీవలే దర్శకుడు గుణశేఖర్‌ చెప్పుకొచ్చాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. శాకుంతలం సినిమా పూర్తి అయిన తర్వాత కొత్త పాన్ ఇండియా వెబ్‌ సిరీస్ ను సమంత చేయబోతుందేమో చూడాలి. సమంత కొత్త ప్రాజెక్ట్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.