Begin typing your search above and press return to search.
మరో అందాల కథానాయిక ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్
By: Tupaki Desk | 13 Oct 2020 11:30 AM ISTకరీనాకపూర్ ఖాన్... అనుష్క శర్మ .. అనిత హసనందానీ ఈ సంవత్సరం బేబి బంప్ సెలబ్రేషన్స్ తో శుభవార్తను అభిమానుల కు చెప్పారు. తాజాగా మరో నటి త్వరలో తమ ఇంట కొత్త సభ్యుడిని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. చక్ దే ఇండియా ఫేం సాగారికా ఘట్గే - టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ తమ మొదటి బిడ్డను స్వాగతించబోతున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత వారం యుఎఇలో తన భర్త పుట్టినరోజు వేడుకలో సాగరిక ఘాట్గే పాల్గొంది. అప్పటి నుంచి ఫ్రెగ్నెన్సీకి సంబంధించిన ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
ఈ జంట దానిని అధికారికంగా చేయకపోయినా.., బేబీ బంప్ లాగా కనిపించే వదులుగా ఉన్న నల్ల దుస్తులు ధరించడం అందుకు సూచనగా భావించారు అభిమానులు. ఈ జంట ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నారు. జహీర్ అక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు. జహీర్ నీతా అంబానీ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఆపరేషన్స్ డైరెక్టర్.
అక్టోబర్ 7 న జహీర్ కి 42 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా అతని భార్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వరుస చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చిన సాగరిక ఘాట్గే ఖాన్ తన భర్త మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్. ఆమెకు తెలిసిన అత్యంత నిస్వార్థపూరితమైన వ్యక్తి అని ఆనందం వ్యక్తం చేసింది. జహీరోతో సాగరిక ప్రేమాయణం.. హాజెల్ కీచ్ తో యువరాజ్ సింగ్ ప్రేమాయణం సమాంతరంగానే సాగిన సంగతి తెలిసిందే.
సాగరికా ఘాట్గే 2007 చిత్రం `చక్ దే ఇండియా`లో హాకీ ప్లేయర్ ప్రీతి సభర్వాల్ పాత్రలో చిరస్మరణీయ నటనతో ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్ ఖాన్ హాకీ కోచ్ గా నటించారు. తన ఇటీవలి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లలో సాగరిక లేటెస్ట్ ప్రాజెక్ట్ `ఫుట్‌ఫేరీ`ని ప్రకటించింది. ఇది క్రైమ్ థ్రిల్లర్. దేవికా అనే క్రైమ్ థ్రిల్ ఔత్సాహికురాలిగా కనిపిస్తుందట. ఇక జహీర్ - సాగరిక జంట ఏప్రిల్ 2017 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదవ సీజన్లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. తరువాత జహీర్ 23 నవంబర్ 2017 న వివాహం చేసుకున్నారు.