Begin typing your search above and press return to search.

న‌టితో క్రికెట‌ర్ ప్రేమాయ‌ణం.. నెటిజన్ల సాక్ష్యాలు!

By:  Tupaki Desk   |   17 May 2021 7:30 AM GMT
న‌టితో క్రికెట‌ర్ ప్రేమాయ‌ణం.. నెటిజన్ల సాక్ష్యాలు!
X
ఐపీఎల్ క్రికెట‌ర్ ఓ టీవీ న‌టితో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌ట‌. అయితే.. వీరిద్ద‌రూ ఓపెన్ కాకుండా త‌మ లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తున్నార‌ట‌. ఇదే.. నెటిజ‌న్ల కంప్లైంట్. వెంట‌నే ఇన్వెస్ట్ గేష‌న్ మొద‌లు పెట్టేసి, ప‌క్కా ఆధారాలు సేక‌రించార‌ట‌. వారు సేక‌రించిన ఆధారాలేంటో తెలుసుకునే ముందు.. అస‌లు వారిద్ద‌రెవ‌రో చూద్దాం.

ఆ క్రికెట‌ర్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ యువ‌ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ కాగా.. ఆమె మ‌రాఠీ సీరియ‌ల్ న‌టి స‌యాలీ సంజీవ్‌. వాళ్ల మ‌న‌సులో ఏముందో వాళ్లు చెప్పకుండానే.. ఇద్ద‌రికీ ముడేస్తున్నారు నెటిజ‌న్లు. ఇటీవ‌ల స‌యాలీ సోస‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.అందులో ఆమె ఫొటోను షేర్ చేసింది. దీనికి రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు.

ఆ కామెంట్లో అక్ష‌రాలేం లేవు. క‌ళ్ల‌లో ల‌వ్ సింబ‌ల్ నిండిన ఎమోజీని పోస్టు చేశాడు. దీనికి ఆ బ్యూటీ కూడా రిప్లే ఇచ్చింది. ల‌వ్ సింబ‌ల్ తో సిగ్గు ప‌డుతున్న ఎమోజీని పోస్టు చేసింది. దొరికారు దొంగ‌లు అంటూ.. ఇక్క‌డే ప‌ట్టేసుకున్నారు నెటిజ‌న్లు. ఈ సాక్ష్యాల‌నే ఆధారాలుగా చూపిస్తూ.. వీళ్లిద్ద‌రూ రెడ్ హ్యాడెండ్ గా దొరికిపోయార‌ని, వీళ్లు ఖ‌చ్చితంగా ప్రేమ‌లో ఉన్నార‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు.

ఈ విష‌యం వారిదాకా పోవ‌డంతో స్పందించాడు రుతురాజ్‌. ‘‘కేవలం బౌలర్లు మాత్రమే నన్ను క్లీన్ బౌల్డ్ చేయగలరు. మరెవరికీ సాధ్యం కాదు. అర్థమైన వారికి, అర్థం కావాల్సిన వాళ్లకే ఈ పోస్టు’’ అని క్లారిటీ ఇచ్చేశాడు. త‌న‌ను ఏ అమ్మాయీ ప‌డేయ‌లేద‌ని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు.

అయిన‌ప్ప‌టికీ.. నెటిజ‌న్లు విన‌ట్లేదు. మేం ప‌సిగ‌ట్టామంటే అంతే.. అత‌ను అబ‌ద్దం చెబుతున్నాడు. వాళ్ల మ‌ధ్య ‘‘స‌మ్ థింగ్‌.. స‌మ్ థింగ్ గోయింగ్ ఆన్‌..’’ అంటూ చెబుతూనే ఉన్నారు. మరి, నిజం ఏంటన్నది తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.