Begin typing your search above and press return to search.

రుద్రమ నే 'శంకుంతల'

By:  Tupaki Desk   |   11 Oct 2020 5:04 PM IST
రుద్రమ నే శంకుంతల
X
గుణశేఖర్‌ 'రుద్రమదేవి' సినిమా తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు. రుద్రమదేవి విడుదల సమయంలోనే ప్రతాపరుద్రుడు సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించిన గుణశేఖర్‌ ఆ తర్వాత హిరణ్యకశ్యప సినిమాను రానాతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ సినిమా షూటింగ్‌ రెండేళ్లుగా అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఇంకా కూడా ఆ సినిమాకు రానా సమయం కావాలంటూ కోరడంతో గుణశేఖర్‌ మరో సినిమాను అనౌన్స్‌ చేసిన విషయం తెల్సిందే.

రుద్రమదేవి సినిమా విడుదల అయ్యి సరిగ్గా 5 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా గుణశేఖర్‌ నుండి 'శాకుంతలం' సినిమా ప్రకటన వచ్చింది. హిరణ్య కశ్యప సినిమాకు ముందు శాకుంతలం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా గుణశేఖర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. శకుంతల దుష్యంతుడి ప్రణయగాధ చాలా ఫేమస్‌. ఆ కథను తీసుకుని గుణశేఖర్‌ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఛాలెంజింగ్‌ రోల్‌ అయిన శకుంతల దేవి పాత్రను ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఉదయించింది.

ఈ సందర్బంగా చాలా మంది ఆ ప్రశ్నకు అనుష్క అయితే బాగుంటుందనే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే గుణశేఖర్‌ అనుష్క తో చర్చలు కూడా జరిపి ఉంటాడు అనే ప్రచారం జరుగుతోంది. రుద్రమ దేవి సినిమా అనుష్క కెరీర్‌ లో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాను అందించిన దర్శకుడితో అనుష్క మళ్లీ వర్క్‌ చేసేందుకు ఖచ్చితంగా రెడీగా ఉంటుంది. అందుకే శాకుంతలం సినిమాలో అనుష్క నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.