Begin typing your search above and press return to search.

టీవీ యాంక‌ర్ తో ఆర్జీవీ హాట్ సినిమానా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 5:30 PM GMT
టీవీ యాంక‌ర్ తో ఆర్జీవీ హాట్ సినిమానా?
X
సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ హాట్ కంటెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాలో సంచ‌ల‌న విష‌యాలు లేక‌పోయినా.. వాస్త‌వ సంఘ‌ట‌నలేవి లేక‌పోయినా.. ఆ జీవి ఇలా అప్పుడ‌ప్పుడు హాట్ కంటెంట్ మీద ప‌డుతుంటుంది. అమ్మాయిలో ఏదో ఒక పాయింట్ ప‌ట్టుకుని క‌థ ఆల్లేసి నెల రోజుల్లో షూటింగ్ చుట్టేసి కుదిరితే థియేట‌ర్లో... లేదంటో ఓటీటీ..యూ ట్యూబ్ ల్లో రిలీజ్ చేసి రిలాక్స్ అవుతుంటారు.

అలా వ‌ర్మ చేతికి కొంత ఆదాయం చేకురుతుంది. సినిమాని ఎలా బిజినెస్ చేయాలా బాగా తెలిసిన దిగ్గ‌జం. కాబ‌ట్టి ఆర్జీవీ ఇలాంటి సినిమా చేసాడ‌ని సామాన్యుడు అనుకుంటాడు త‌ప్ప‌! ఆయ‌న స్ర్టాట‌జీ తెలిసిన వాడు మాత్రం అనుకోడు. తాజాగా వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తున్నాడా? ఓ హాట్ టీవీ యాంక‌ర్ తో అంత‌కు మించిన హాట్ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నాడా? అత‌ను మెచ్చిన యాంక‌ర్నే ఒప్పించి రంగంలోకి దించుతున్నాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది ఫిలిం స‌ర్కిల్స్ వ‌ర్గాల్లో.

ఇక్క‌డ విష‌యం వ‌ర్మ హాట్ కంటెంట్ కాదు. ఆ కంటెంట్ లో న‌టించే యాంక‌ర్ ఎవ‌ర‌న్న‌ది హైలైట్ చేయాల్సిన అంశం. ఆ యాంక‌ర్ ఎవ‌రో కాదు. ఓ ప్ర‌ముఖ తెలుగు వార్తా ఛానెల్ లో ప‌నిచేస్తుందిట‌. ఆమె వాయిస్ అద్భుత‌మ‌మంట‌. మంచి హైట్..వెయిట్ తో పాటు రంగు కూడా ఉంటుందిట‌. వ‌ర్మ ఆమె అందానికి మంత్ర ముగ్దుడై త‌న కోసం క‌థ రాసి ఒప్పించాడుట‌. అయితే ఇది ఒక్క‌రోజులో జ‌రిగింది కాదు. దీనికోసం ఏడాదిగా శ్ర‌మిస్తుంటే ఆ యాంక‌ర్ ఇప్పుడు అంగీక‌రించిందిట‌.

స్టిల్ ఆ యాంక‌ర్ ఇప్ప‌టికీ ఆ వార్తా ఛాన‌ల్ లో వార్త‌లు చ‌దువుతూనే ఉందిట‌. వర్మ‌ ప్ర‌పోజ‌ల్ కి ఒప్పించ‌డం ముందు క‌ష్ట‌మైనా... ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా కన్విన్స్ చేసి ఒప్పించాడుట‌. మ‌రి ఆ యాంక‌ర్ ఎవ‌ర‌న్న‌ది తెలియాలి. ఆ యాంక‌ర్ తో `ఐస్ క్రీమ్` లాంటి హాట్ సినిమా తీస్తాడా? `అషురెడ్డి`లా ఆమె త‌ర‌హాలో మీడియాలో ముందు ప్రొజ‌క్ట్ చేస్తాడా? అన్న‌ది మ‌రో సందేహం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.