Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా హీరో కాకపోతే ఒప్పుకోదట!
By: Tupaki Desk | 27 July 2020 8:30 AM ISTతెలివైన గేమ్ ప్లాన్ అంటే ఏమిటి? దీపం ఉండగానే చక్కదిద్దుకోవడమెలా? ఈ రెండు ప్రశ్నలు రష్మిక ముందుంచితే ఏమాత్రం తడుముకోకుండా ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రస్తుతం రష్మిక ఎంపికలు చూస్తుంటే సాధా సీదా నిర్మాతలకు షాక్ తగులుతోందట. పైగా కన్నడ పరిశ్రమ వర్గాలు అయితే అవాక్కవుతున్నాయట.
అంతగా రష్మిక ఏం చేస్తోంది? అంటే.. తొలిగా టాలీవుడ్ కి ఇచ్చినట్టుగా శాండల్వుడ్ కి ప్రాధాన్యత ఇవ్వదట. పైగా అక్కడ ఆఫర్లు వచ్చినా నో చెప్పేస్తోంది. ఓన్లీ పాన్ ఇండియా స్టార్ యష్ కి మాత్రమే ఓకే చెబుతోందట. అసలింతకీ ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగమా? అంటే అవుననే అర్థమవుతోంది.
రష్మిక మందనకు కన్నడ కంటే తెలుగు లోనే ఫేమ్ ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే రష్మిక కన్నడ పరిశ్రమ కంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపైనే ఫోకస్ ఎక్కువ పెట్టింది..! కన్నడ లో యష్ తప్పితే వేరే హీరో ఎవ్వరికీ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని గిరి గీసుకుందట. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం రష్మికకు తెలుగులో డిమాండ్ ఉంది. 2020 తనకు అప్పనంగా కలిసొచ్చింది.
2020 సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు.. ఆ తర్వాత వచ్చిన భీష్మ హిట్లు అవ్వడంతో ఇక్కడ గోల్డెన్ లెగ్ గా వెలిగిపోతోంది. ఇటీవల బడా నిర్మాతలే తన వెంటపడి ఆఫర్లు ఇస్తున్నారు. పైగా రష్మిక కన్నడ లో నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా తన క్రేజ్ ని ఇమేజ్ ని పెంచుతున్నాయి. అందుకే ఇలా కండీషన్స్ అప్లయ్ అంటోందన్నమాట. అలాగే కన్నడ పరిశ్రమ రేంజ్ తెలుగు పరిశ్రమతో పోలిస్తే చాలా చిన్నది అన్న సంగతి తెలిసిందే. తనకు రీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే టాలీవుడ్ పై కర్ఛీఫ్ వేస్తోందన్నమాట.