Begin typing your search above and press return to search.

ఆ క్రేజీ మల్టీ స్టారర్ కోసం రానా సంతకం?

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:48 AM GMT
ఆ క్రేజీ మల్టీ స్టారర్ కోసం రానా సంతకం?
X
పవ‌న్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా మలయాళం హిట్ చిత్రం `అయ్యపనం కోషియం` రీమేక్ చేస్తున్న విష‌యం అందరికీ తెలిసినదే. ఇందులో ప‌వ‌న్ తో పాటు మ‌రో హీరోకి స్కోప్ ఉంది. ఇంత‌కీ ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌దానికి ఇన్నాళ్లు స‌స్పెన్స్ వీడ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ పాత్రను పోషించాల్సిందిగా మేక‌ర్స్ రానా చర్చలు జరిపారని తెలుస్తోంది.

ట్యాలెంటెడ్ రానా ఆ పాత్ర‌లో న‌టించేందుకు సంతకం చేశారా లేదా? అన్న‌ది మేక‌ర్స్ ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. అతి త్వరలో కాస్టింగ్ గురించి ప్రకటించే వీలుంద‌ని భావిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించనున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మ‌వుతోంది.

పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవితో చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌న్న వేరొక స‌మాచారం ఉంది. అయితే తాను అంగీక‌రించిందా లేదా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.