Begin typing your search above and press return to search.

వారియర్‌ పై రామ్‌ కు అంత నమ్మకమా..?

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:40 AM GMT
వారియర్‌ పై రామ్‌ కు అంత నమ్మకమా..?
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ హీరోగా తమిళ మాస్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అన్ని ఏరియాల బిజినెస్ దాదాపుగా క్లోజ్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. సినిమా కు మొదటి నుండి కూడా పాజిటివ్ బజ్ ను క్రియేట్‌ చేయడం లో యూనిట్‌ సభ్యులు సక్సెస్ అయ్యారు.

రామ్‌ ఫస్ట్‌ లుక్ విడుదల అయినప్పటి నుండి మొన్న విడుదల అయిన బుల్లెట్‌ బండి పాట వరకు అన్ని కూడా సినిమా పై అంచనాలు పెంచడం వల్ల మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వైజాగ్ రైట్స్ ను స్వయంగా హీరో రామ్ కొనుగోలు చేశాడట. ఆయనకు ఈ సినిమాపై ఉన్న నమ్మకం తో భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందని సమాచారం అందుతోంది.

వైజాగ్ రైట్స్ ను రామ్‌ దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్‌ ద్వారా దాదాపుగా 40 కోట్లకు కాస్త అటు ఇటుగా రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌ ద్వారా వైజాగ్‌ లో ఈ సినిమాను రామ్ పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.

ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. రామ్ మరియు కృతి శెట్టి ల కాంబో రొమాన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రామ్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్ గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీ గా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.

లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రాలు గతంలో తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

రామ్ మరియు లింగు స్వామి కాంబోలో రూపొందిన ది వారియర్‌ మూవీ తెలుగు తో పాటు తమిళంలో కూడా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ హడావుడి మొదలు పెట్టబోతున్నారు.