Begin typing your search above and press return to search.

రకుల్ ఇక వెటరన్ హీరోయినా ?

By:  Tupaki Desk   |   10 Aug 2019 2:18 PM IST
రకుల్ ఇక వెటరన్ హీరోయినా ?
X
నిన్న విడుదలైన మన్మధుడు 2 మీద ఎన్నో అంచనాలు ఆశలు పెట్టుకున్న హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లెక్క తప్పినట్టే కనిపిస్తోంది. వచ్చిన టాక్ మీడియా చెబుతున్న రిపోర్ట్స్ అన్ని డివైడ్ గా ఉండటంతో ఫలితం ఫైనల్ గా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాలో కంటెంట్ ని పక్కన పెడితే రకుల్ ఎంత చేయాలో అంతా చేసింది. నాగ్ లాంటి ఏజ్ బార్ హీరో పక్కన ఎబ్బెట్టుగా ఉంటుందేమో అని భావిస్తే పర్లేదు జోడిగా సెట్ అయ్యిందే అనిపించేలా మెప్పించింది.

అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా రకుల్ ఇందులో ఏ మొహమాటం చూపలేదు. తొడలు జబ్బలు కనిపించే కాస్ట్యూమ్స్ తో పాటు ఝాన్సీకి లిప్ లాక్ కిస్సులు ఇవ్వడం దాకా అన్ని మసాలాలకు సై అనేసింది. మొన్నటిదాకా యూత్ స్టార్లతో ఆడి పాడిన రకుల్ ఇకపై సీనియర్ హీరోలు ఎవరు కావాలన్నా మంచి ఛాయస్ గా నిలిచేలా ఉంది.

ఆ మధ్య బాలీవుడ్ లో యాభై ఏళ్ళ మరో హీరో అజయ్ దేవగన్ తో దే దే ప్యార్ దేలో తనే హై లైట్ గా నిలిచింది. అందులో ఒలకబోసిన అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వరస చూస్తుంటే రేపు చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోల ప్రాజెక్ట్స్ లో కాల్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగూ సీనియర్ మోస్ట్ హీరోల పక్కన సెట్ అవుతోంది కాబట్టి రకుల్ ఇకపై ఇదే రూట్ కంటిన్యూ చేస్తే కనక శ్రేయ లాగా కెరీర్ ఎక్స్ టెండ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు