Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ కు వార్నింగ్‌ బెల్స్‌

By:  Tupaki Desk   |   13 Jan 2020 7:06 AM GMT
సూపర్‌ స్టార్‌ కు వార్నింగ్‌ బెల్స్‌
X
సౌత్‌ ఇండియా మాత్రమే కాకుండా దేశం మొత్తంలో మరియు కొన్ని దేశాల్లో కూడా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు అశేష అభిమానగనం ఉండేది. రజినీకాంత్‌ ఏ సినిమా చేసినా కూడా కలెక్షన్స్‌ టాప్‌ లో ఉండేవి. రోబో వరకు రజినీకాంత్‌ సినిమా అంటే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వరద పారేది. రికార్డులే రికార్డులు. కాని ప్రస్తుత పరిస్థితి వేరు. రజినీకాంత్‌ ఆరు పదుల వయసు దాటిన తర్వాత చేస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటడంలో విఫలం అవుతుంది. ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం అంతగా ఉండటం లేదు.

ప్రస్తుతం కోలీవుడ్‌ లో విజయ్‌.. అజిత్‌ మరియు ఇంకా కొందరు యువ హీరోల ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా విజయ్‌ ఏ సినిమా చేసినా కూడా కలెక్షన్స్‌ కుమ్మేస్తున్నాయి. గతంలో రజినీకాంత్‌ ఎలా అయితే వసూళ్లు దండుకునేవాడో ఇప్పుడు విజయ్‌ ఆ స్థాయిలో దూసుకు పోతున్నాడు. విజయ్‌ కలెక్షన్స్‌ ముందు రజినీకాంత్‌ కలెక్షన్స్‌ తేలిపోతున్నాయి. ఇటీవల విడుదల అయిన దర్బార్‌ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు.

ఓపెనింగ్స్‌ విషయంలో విజయ్‌ కి కనీసం చేరువలోకి కూడా రజినీకాంత్‌ వెళ్లలేక పోతున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. రజినీకాంత్‌ క్రేజ్‌ తగ్గింది. ఆయన సినిమాలను ప్రేక్షకులు చూడాలనుకోవడం లేదని.. ఆయన సినిమాలకు రిటైర్‌ మెంట్‌ ఇవ్వడం ఉత్తమం అంటూ సోషల్‌ మీడియాలో ఇతర హీరోల అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. కాని రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఖచ్చితంగా సూపర్‌ స్టార్‌ మళ్లీ పుంజుకోవడం ఖాయం అంటూ ధీమాగా ఉన్నారు.