Begin typing your search above and press return to search.

రజనీకాంత్ కూతురు.. డైవర్సా???

By:  Tupaki Desk   |   16 Sep 2016 1:30 PM GMT
రజనీకాంత్ కూతురు.. డైవర్సా???
X
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే.. ఇండియన్ సినిమాకి.. బాక్సాఫీస్ కి సూపర్ కింద లెక్క. ఏజ్ తో లింక్ లేని క్రేజ్ ఈయనది. సూపర్ స్టార్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అనిపించే రేంజ్ ఆయని. కానీ రజినీకాంత్ తన కూతురు కుటుంబ జీవితాన్నే కాపాడలేకపోయారనే వార్తలు వస్తున్నారు. రజినీని హీరోగా పెట్టి.. కొచ్చాడయాన్(తెలుగులో విక్రమ సింహ) అంటూ మోషన్ కాప్చర్ మూవీ తీసిన సౌందర్య అశ్విన్.. ఇప్పుడు విడాకులకు ఫైల్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఆరేళ్ల క్రితం చెన్నై బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ అశ్విన్ ను సౌందర్య వివాహం చేసుకోగా.. కొన్ని రోజులకే వీరి మధ్య విబేధాలు తలెత్తాయనే టాక్ ఉంది. చాలాకాలంగా విడిగానే ఉంటున్న ఈ జంట.. ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా అమెరికాలో ట్రిప్ ముగించుకుని వచ్చాక కూడా.. కూతురు సౌందర్య ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్న రజినీకాంత్.. ఆమె ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నాడట. ఈ సమయంలో కూతురు కాపురం నిలబెట్టేందుకు ఆయన ప్రయత్నించినా.. ఫలితం లేకపోయిందని ''ది ఇండియన్ ఎక్స్ ప్రెస్'' పేపర్ ప్రచురించింది.

రజినీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి సమాచారం లేదు కానీ.. ట్విట్టర్లో మొన్నటివరకు తన పేరును ''సౌందర్య.ఆర్.అశ్విన్'' అని పెట్టుకున్న సౌందర్య ఇప్పుడు మాత్రం ''సౌందర్య రజనీకాంత్'' అంటూ మార్చేసింది. ఇకపోతే ఈ మధ్య అశ్విన్ ని ఇదే విషయమై ప్రశ్నిస్తే.. ఏ సమాధానం చెప్పుకుండా తప్పుకోవడంతో.. డైవర్స్ వాదనకు బలం చేకూరిందని.. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయట. అది సంగతి.