Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కోసం జక్కన్న అంతగా వేచి చూశాడా?
By: Tupaki Desk | 2 Jun 2023 10:00 AMదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయాలనేది ఎందరో నటీనటుల కల. ఆయన తెరకెక్కించే సినిమాలో అతిథి పాత్రలో అయినా మెరవాలని కలలుగంటారు. కానీ ఆ అవకాశం వరించేది ఎందరిని? అయితే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా వెలిగిపోతున్న రాజమౌళి కి ఒక ప్రముఖ నటుడు మాత్రం అసలు చిక్కడు దొరకడు అన్న ప్రచారం చాలా కాలంగా ఉంది.
ప్రతిసారీ అతడి కోసం ఒక పాత్రను రాసుకోవడం ఆ తర్వాత కాల్షీట్లు దొరక్క వేరొక నటుడిని వెతుక్కోవడం రాజమౌళికి తప్పలేదట. అంతేకాదు సదరు సూపర్ స్టార్ తో పూర్తి నిడివి సినిమా కోసం రాజమౌళి ఒక కథనే రాసాడు. కాల్షీట్ల కోసం సంప్రదించాడు. కానీ అది సుసాధ్యం కాలేదు. దీంతో ఆ సినిమా కథను అటూ ఇటూ మార్చేసి చివరికి 'యమదొంగ'గా తెరకెక్కించారట.
అంతేకాదు ఆ తర్వాత కూడా సదరు సూపర్ స్టార్ కాల్షీట్ల కోసం రాజమౌళి చాలా వేచి చూసారు. పాన్ ఇండియా సంచలనం 'బాహుబలి' ఫ్రాంఛైజీలో నటించాల్సిందిగా కోరారు. కానీ అతడు చిక్కలేదు. ఆ తర్వాతా ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లోను ఒక కీలకమైన పాత్రకు ఎంపిక చేసారు. కానీ మళ్లీ ఆయన చిక్కలేదు దొరకలేదు. దీంతో సదరు స్టార్ హీరోతో పని చేయాలన్న రాజమౌళి కల నెరవేరనే లేదు.
అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న జంగిల్ అడ్వెంచర్ కోసం మరోసారి సదరు స్టార్ హీరోని సంప్రదించగా ఈసారి ఓకే చెప్పారని తెలిసింది. తన పాత్ర లైన్ విని నచ్చిందని చెప్పారట. అయితే ఇంకా కాల్షీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఏళ్ల తరబడి ఒకే సినిమా కోసం పని చేసే ఇండియన్ జేమ్స్ కామెరూన్ రాజమౌళికి కాల్షీట్లు సర్ధుబాటు చేయడం అంత సులువేమీ కాదు. ఈసారి మాత్రం అలాంటి సమస్య రాకుండా జక్కన్న ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తాడో చూడాలి.
ఇంతకీ సదరు సూపర్ స్టార్ ఎవరై ఉంటారు? అంటే... మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ గురించే ఇదంతా. కంప్లీట్ స్టార్ గా పాపులరైన మోహన్ లాల్ గతంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ లో నటించారు. ఆ సినిమా కోసం కొరటాల బాగానే ఒప్పించారు. కానీ రాజమౌళికి మాత్రం ఇప్పటికీ లాల్ చిక్కడం లేదు. ఈసారి కచ్ఛితంగా లాల్ ని జక్కన్న లాక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.
మోహన్ లాల్ చేరికతో మాలీవుడ్ లో ఈ సినిమా మార్కెట్ రేంజ్ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు. మహేష్ కథానాయకుడిగా భారీ పాన్ ఇండియా సినిమా కోసం రాజమౌళి- విజయేంద్రప్రసాద్ -కీరవాణి బృందాలు ఇప్పటికే సీరియస్ గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.