Begin typing your search above and press return to search.
జక్కన్న వెబ్ సిరీస్ ప్లానింగ్స్
By: Tupaki Desk | 10 July 2020 11:45 AM ISTప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ లో చాలా మంది వెబ్ సిరీస్ ల వెంట పరుగు పెడుతున్నారు. రాబోయే కాలం అంతా కూడా ఓటీటీదే అవ్వడంతో ఇప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఓటీటీ పై వెబ్ సిరీస్ లు రూపొందించే పనిలో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన దర్శకత్వంలో కాకుండా ఆయన సారధ్యంలో వెబ్ సిరీస్ లు రాబోతున్నాయట.
జక్కన్న ఒక టీంను ఏర్పాటు చేసి మంచి ఐడియాలు ఉన్న వారిని ఆహ్వానించి వారిని ప్రోత్సహించి వారితో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు సిద్దం అవుతున్నారట. కొన్ని వెబ్ మూవీస్ లను కూడా ప్రస్తుతం చేస్తున్నారట. జక్కన్న కథల విషయంలో సలహాలు సూచనలు కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తుంది.
ఇది పుకారే అయ్యి ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కాని ఇది నిజం అయితే మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్ ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి జక్కన్నకు ఆ ఆలోచన ఇప్పటికి లేకుంటే భవిష్యత్తులో అయినా కలగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.