Begin typing your search above and press return to search.

ల‌క్కీ ఛామ్ హీరోతో పీవీపీ కంబ్యాక్ మూవీ?

By:  Tupaki Desk   |   1 Nov 2020 4:20 PM IST
ల‌క్కీ ఛామ్ హీరోతో పీవీపీ కంబ్యాక్ మూవీ?
X
వ‌రుస‌గా భారీ చిత్రాల్ని నిర్మించిన `పీవీపీ సినిమా` సంస్థ ఇటీవ‌ల చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం టాలీవుడ్ మీడియాలో పీవీపీ పేరు ఏదో ఒక అంశంతో ప్ర‌ముఖంగా వినిపించేది. కానీ గ‌త కొంత‌కాలంగా ఆయ‌న సైలెంటుగా ఉంటున్నారు. అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే స‌త్తా ఉండీ ఎందుక‌నో ఆయ‌న సైలెన్స్ మెయింటెయిన్ చేయ‌డంపై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఊపిరి- బ్ర‌హ్మోత్స‌వం- క్ష‌ణం- రాజుగారి గ‌ది 2- మ‌హ‌ర్షి వంటి చిత్రాల్ని పీవీపీ నిర్మించారు. మ‌హ‌ర్షి చిత్రాన్ని భాగ‌స్వామ్యంలో నిర్మించ‌గా క‌ల‌త‌లు త‌లెత్తాయ‌ని కూడా ప్ర‌చారమైంది. ఆ త‌ర్వాత‌ అడివి శేష్ హీరోగా వ‌రుస‌గా సినిమాల‌కు ప్లాన్ చేశారు పీవీపీ. ఈ కాంబోలో ఎవ‌రు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. పెద్ద హీరోల‌తో సినిమాలు క‌లిసి రాక‌పోయినా చిన్న సినిమాలతో మీడియం రేంజు హీరోల‌తో బాగానే హిట్లు కొట్టారు.

అయితే ఎందుక‌నో పీవిపీ బ్యాన‌ర్ ఇటీవ‌ల‌ సైలెంట్ అయిపోయింది. ..ఈ బ్యాన‌ర్ లో ప్ర‌స్తుతానికి సినిమాలు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో లేవ‌ని తెలుస్తోంది. అయితే ఈ బ్యాన‌ర్ తో ల‌బ్ధి పొంది కొన్ని హిట్స్ సాధించిన‌ అడివి శేష్ వంటి హీరోలు మాత్రం త్వ‌ర‌లోనే ఓ భారీ ప్రాజెక్ట్ తో పీవిపీ కి క‌మ్ బ్యాక్ ఇవ్వ‌నున్నార‌ట‌. అయితే ఈ జోడీ మ‌రోసారి ఎవ‌రు త‌ర‌హా థ్రిల్ల‌ర్ తో వ‌స్తారా? అన్న‌ది వేచి చూడాలి. కొంద‌రు నిర్మాత‌ల‌తో భాగ‌స్వామ్య కాపురంలో క‌ల‌త‌లు పీవీపీని ఇబ్బంది పెట్ట‌డం వ‌ల్ల‌నే కాస్త గ్యాప్ తీస్కున్నారా? అన్న‌ది కూడా ఆయ‌నే చెప్పాల్సి ఉంది.