Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్' ని 'పుష్ప‌' టీమ్ ఫాలో అవుతోందా?

By:  Tupaki Desk   |   14 Jun 2022 10:33 AM GMT
కేజీఎఫ్ ని పుష్ప‌ టీమ్ ఫాలో అవుతోందా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప ది రైజ్‌' దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీని ముత్యం శెట్టి మీడియాతో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీలో ఫహ‌ద్ ఫాజిల్‌, సునీల్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అజ‌య్ ఘోష్‌, ధ‌నంజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గ‌త ఏడాది భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది. అంతే కాకుండా ఈ మూవీలోని ప్ర‌తీ అంశం, మేన‌రిజ‌మ్, సాంగ్స్ ఒక‌ట‌ని కాకుండా ప్ర‌తీదీ వైర‌ల్ గా మారి సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపుల‌ర్ అయ్యేలా చేసింది. క్రికెట‌ర్లు, బాలీవుడ్ స్టార్స్‌, యూట్యూబర్స్‌, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఈ మూవీ డైలాగ్ ల‌ని వైర‌ల్ చేశారు. దీంతో సినిమా భారీ స్థాయిలో పాపులారిటినీ సొంతం చేసుకుని వార్త‌ల్లో నిలిచింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ మూవీకి సీక్వెల్ గా 'పుష్ప 2' తెర‌పైకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ ఫైన‌ల్ స్టేజ్ కి చేరింది. జూలై, లేదా ఆగ‌స్టులో 'పుష్ప 2' ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

'కేజీఎఫ్ 2' సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని స‌రికొత్త రికార్డులు సాధించిన నేప‌థ్యంలో 'పుష్ప 2' స్క్రిప్ట్ లోనూ మార్పులు చేశార‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ సెట్స్ వెళ్ల‌నున్న నేప‌థ్యంలో రోజుకో ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

'పుష్ప‌' క్లైమాక్స్ ని పెళ్లి సీన్ తో ఎండ్ చేసిన సుకుమార్ 1'పుష్ప 2' క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ని ప్లాన్ చేశార‌ట‌. 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో చాప్ట‌ర్ 3 కి లీడ్ ఇచ్చేసి వ‌దిలిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా అలాంటి ట్విస్ట్ నే 'పుష్ప 2' క్లైమాక్స్ కు డిజైన్ చేశార‌ట సుకుమార్‌. అంటే 'పుష్ప 2' త‌రువాత దీనికి కొన‌సాగింపుగా 'పుష్ప 3'ని కూడా చేయ‌బోతున్నామ‌ని హింట్ ఇవ్వ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌న్నీ మార్పులు చెప్ప‌డంతో సుకుమార్ పార్ట్ 3 కి లీడ్ వ‌దిలార‌ని తెలుస్తోంది.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న పార్ట్ 2 కోసం మ‌రికొంత మంది కొత్త న‌టుల‌ని తీసుకోబోతున్నార‌ట‌. క‌న్న‌డ స్టార్ దేవ‌రాజ్ త‌న‌యుడు ప్ర‌జ్వ‌ల్ దేవ‌రాజ్ ని ఇప్ప‌టికే పార్ట్ 2 కోసం ఎంపిక చేశార‌ని, దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే పార్ట్ 2 కోసం ట్యూన్స్ ని రెడీ చేశాడ‌ని తెలిసింది.