Begin typing your search above and press return to search.

'పుష్ప 2' వ‌చ్చే ఏడాది రావ‌డం క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   11 Dec 2022 12:30 AM GMT
పుష్ప 2 వ‌చ్చే ఏడాది రావ‌డం క‌ష్ట‌మేనా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌లైంది. ఉత్త‌రాదిలో అనూహ్యంగా ఈ మూవీకి ప్రేక్ష‌కులు ద‌క్షిణాదికి మించి బ్ర‌హ్మర‌థం ప‌ట్టారు. ఏకంగా వంద కోట్ల మేర వసూళ్ల‌ని హిందీ వెర్ష‌న్ రాబ‌ట్ట‌డం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబ‌ర్ 17తో ఈ మూవీ విడుద‌లై ఏడాది పూర్తి కాబోతోంది. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ ఏడాది త‌రువాత `పుష్ప 2` సెట్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు.

గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతూ వ‌స్తున్న సుకుమార్ ఫైన‌ల్ గా స్క్రిప్ట్ ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసి షూటింగ్ కి రెడీ అయిపోతున్నాడు. ఇటీవ‌లే బ‌న్నీపై లుక్ టెస్ట్ ని పూర్తి చేసిన సుకుమార్ ఫైన‌ల్ గా సీక్వెల్ స్టోరీకి అద‌న‌పు హంగుల్ని జ‌త చేసి భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని తెర‌పైకి తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. మేలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నఈ పాన్ ఇండియా వండ‌ర్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా డిసెంబ‌ర్ 8న ఈ మూవీని ర‌ష్యాలో విడుద‌ల చేశారు. మాస్కోకి ప్ర‌త్యేకంగా వెళ్లిన చిత్ర బృందం `పుష్ప‌` కోసం జోరుగా ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించింది. రీసెంట్ గా టీమ్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది. రెగ్యుల‌ర్ షూటింగ్ కి సుకుమార్ అంతా రెడీ చేసేశాడు. ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా వున్న పుష్ప ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న `పుష్ప ది రూల్‌` రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ 12 నుంచి ప్రారంభం కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో `పుష్ప 2` 2023లో రిలీజ్ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ పార్ట్ కి మించి `పుష్ప 2`ని మ‌రింత భారీ స్థాయిలో ఇత‌ర దేశాల్లోనూ చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తుండ‌టంతో `పుష్ప ది రూల్‌` 2023లో వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. `పుష్ప‌` రిలీజ్ విష‌యంలో రాజీప‌డిన మేక‌ర్స్ `సీక్వెల్ విష‌యంలో మాత్రం ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా కి మించి తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

అందులో భాగంగానే ఈ మూవీని 2024 స‌మ్మ‌ర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మైత్రీ వారు, సుకుమార్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ని సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా ఒకేసారి ఈ మూవీని ర‌ష్యన్ వెర్ష‌న్ ని కూడా ఒకే స‌మ‌యంలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే రిలీజ్ విష‌యంలో సుకుమార్ భారీ మార్పులు చేసిన‌ట్టుగా చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.