Begin typing your search above and press return to search.

అందుకే ప్రభాస్ సినిమా అప్డేట్స్ రావడం లేదా?

By:  Tupaki Desk   |   24 May 2020 6:15 AM GMT
అందుకే  ప్రభాస్ సినిమా అప్డేట్స్ రావడం లేదా?
X
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్20 చిత్రంలో నటిస్తున్నాడు. 'రాధే శ్యామ్'.. 'ఓ డియర్'.. 'జాన్' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కానీ ఇంకా అధికారికంగా ఏ టైటిల్ ను ప్రకటించలేదు. 'సాహో' తర్వాత ఈ సినిమా ఎక్కువ గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ సినిమాకు ఎక్కువ గ్యాపే వచ్చింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను దసరాకు విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు రెండు నెలలు షూటింగ్ కు అంతరాయం కలగడంతో ఇపుడు డిలే తప్పేలా లేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి గోల చేస్తున్నారు. కొందరు అభిమానులైతే నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వారిపై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూవీ వారు మాత్రం ప్రోమోస్ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారట. సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది కానీ పెండింగ్ ఉన్న సీన్స్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఉందట. ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్.. టీజర్ లాంటివి ఏవి కట్ చెయ్యాలన్నా ఇంట్రడక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తయి ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకూ తీసిన సీన్స్ తో ఎలాంటి ప్రోమోస్ కట్ చేసినా కంటెంట్ ఏంటో ప్రేక్షకులు వెంటనే గెస్ చేస్తారు. అందుకే ఏం చెయ్యాలా అని యూవీ క్రియేషన్స్ వారు తీవ్రమైన ఆలోచనలో పడ్డారట.

అయితే ఫ్యాన్స్ కు వీటితో సంబంధం లేదు కదా.. వారు తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్ గా రావాలని కోరుకుంటారు. ఎక్కువ కాలం కనుక అప్డేట్స్ రాకపోతే అప్సెట్ అవుతున్నారు.