Begin typing your search above and press return to search.

బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కు మైత్రీ కుదురుతోందా..?

By:  Tupaki Desk   |   25 Feb 2021 11:00 PM IST
బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కు మైత్రీ కుదురుతోందా..?
X
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం సినిమాలు తీస్తూ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది మైత్రీ మూవీ మేకర్స్. చిరంజీవి - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సహా పది సినిమాలను లైన్ లో పెట్టింది. ఈ క్రమంలో మైత్రీ వారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని అప్పుడెప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ప్రభాస్ కు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో మైత్రీ వారి సినిమా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా సెట్ చేయడానికి మైత్రీ అండ్ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ఇప్పటికే డేట్స్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రాజెక్ట్ సెట్ చేయడానికి మైత్రీ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నారట. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనే లతో 'పఠాన్' అనే సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ్. దీని తరువాత హృతిక్ రోషన్ - దీపిక కాంబినేషన్ లో 'ఫైటర్' అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు. మరోవైపు ప్రభాస్ 'రాధే శ్యామ్' 'ఆదిపురుష్' 'సలార్' లతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే 2023లో ప్రభాస్ - సిద్ధార్థ్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.