Begin typing your search above and press return to search.

PRABHAS 20 .. స‌ల్మాన్ టైటిల్ కాపీ?!

By:  Tupaki Desk   |   7 Feb 2020 3:20 PM IST
PRABHAS 20 .. స‌ల్మాన్ టైటిల్ కాపీ?!
X
డార్లింగ్ ప్ర‌భాస్ స‌ల్మాన్ ని వెంటాడుతున్నాడా? భాయ్ ని క‌న్ఫ్యూజ్ చేసి తాను ల‌బ్ధి పొంద‌ద‌లిచాడా? అంటే అవున‌నే భావించాల్సి వ‌స్తోంది. అయితే ప్ర‌భాస్ స‌ల్మాన్ వెంట‌ప‌డ‌డ‌మేమిటి? ఆ ఇద్ద‌రికీ పోలిక దేనిలో? అనే సందేహం క‌లిగితే అస‌లు మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 20వ చిత్రానికి జాన్ అనే టైటిల్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ టైటిల్ ఫైన‌ల్ కాలేద‌ని ఇదివ‌ర‌కూ రివీలైంది. ఫిలింఛాంబ‌ర్ లో ప్ర‌భాస్ 20 మూవీ కోసం వేరే రెండు టైటిల్స్ ని రిజిస్ట‌ర్ చేశారు. రాధేశ్వామ్- ఓ డియర్ అనే టైటిళ్లను నిర్మాత‌ దిల్ రాజు రిజిస్ట‌ర్ చేయించారు. ఈ రెండిటిలో ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేయాల‌న్న‌ది ప్లాన్.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ రెండిటిలోనూ ఒక‌దానిని ఫైన‌ల్ చేసేశారట‌. అది `రాధే శ్యామ్` అని ఖ‌రాకండిగానే తెలుస్తోంది. అయితే ఉన్న‌ట్టుండి స‌డెన్ గా ఎందుకు ఈ టైటిల్ మార్పు? జాన్ టైటిల్ బావున్నా రాధే శ్యామ్ అనేదే ఎందుకు ఫైన‌ల్ చేశారు? అంటే.. దానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే స‌ల్మాన్ భాయ్ న‌టిస్తున్న `రాధే` ఆన్ సెట్స్ ఉంది. ఈ చిత్రానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భాయ్ క్రేజు తో రాధే ఇప్ప‌టికే ఉత్త‌రాది జ‌నాల్లోకి వైర‌ల్ గా వెళ్లి పోయింది.

ఇప్పుడు ప్ర‌భాస్ 20 కి రాధే శ్యామ్ అని పెట్టుకుంటే ఉత్త‌రాది ఆడియెన్ కి వెంట‌నే క‌నెక్ట‌య్యే ఛాన్సుంది. అందుకే డార్లింగ్ టైటిల్ ని మార్చేశార‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. ఇక సాహో చిత్రం ఉత్త‌రాదిన బంప‌ర్ హిట్ కొట్టింది కాబ‌ట్టి ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టించే సినిమాపైనా అక్క‌డ క్రేజు ఉంటుంది. టైటిల్ క‌నెక్టివిటీ బాక్సాఫీస్ కి మ‌రింత అస్సెట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే జాన్ అనే టైటిల్ కంటే రాధే శ్యామ్ వైపే ప్ర‌భాస్ - దిల్ రాజు- రాధా కృష్ణ బృందం మొగ్గు చూపిస్తున్నార‌ని ప్ర‌చార‌మవుతోంది. స‌ల్మాన్ రాధే 2020లో రిలీజ్ కానుంది. అలాగే ప్ర‌భాస్ రాధే శ్యామ్ ఈ ఏడాది లోనే రిలీజ్ ని ఫిక్స్ చేయ‌నున్నారు. అయినా ఇది ప్ర‌భాస్ కి క‌లిసొచ్చే అంశ‌మేన‌ని చిత్ర‌ బృందం భావిస్తోంద‌ట‌. అయినా అస‌లు మెడిసిన్ కి కాపీగా జెనెరిక్ మందు బిళ్ల‌లా ఏమిటీ ప‌బ్లిసిటీ స్టంట్?