Begin typing your search above and press return to search.
మహేష్ లాగే డార్లింగ్ కూడా మారాడు
By: Tupaki Desk | 8 Jun 2023 1:28 PMఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ గొప్ప సిగ్గరి. మాట్లాడాలంటే మొహమాటం. ఈ క్రమంలో అభిమానులతో పాటు మీడియాకి కూడా దూరంగా ఉండేవారు. కేవలం సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్ కార్యక్రమం లో ఒక్కసారే కనిపించేవారు. మళ్లీ ఆయనతో ఇంటరాక్షన్ అనేది చాలా అరుదుగా మాత్రమే ఉండేది.
ఈ క్రమంలో మహేష్ పై కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఆయన సెట్స్ లోనూ..ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? అని ఆయన మొహమాటం జనాల్లోకి నెగిటివ్ గా వెళ్లింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆయనెంత జోవియల్ పర్సన్ అన్నది అర్ధమైంది.
ఇప్పుడు పూర్తిగా మహేష్ ఎక్కడ ఉంటే అక్కడ జోకులే పేల్తాయి అన్నంతగా వెలుగులోకి వచ్చేసారు. మహేష్ తో పనిచేసిన నటులు సెట్స్ లో ఎలా ఉంటారో ఎప్పటికప్పుడు చెబుతుంటారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మొహమాటానికి ప్యాంట్..షర్ట్ వేసినట్లే కనిపించే వారు నిన్న మొన్నటివరకూ. మాట్లాడటం చాలా తక్కువగా ఉండేది. ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అయితే డార్లింగ్ యాటిట్యూడ్ మాత్రం నెగిటివ్ గా జనాల్లోకి వెళ్లలేదు.
ఆయనలో జెన్యూన్ సిగ్గరినే చూసారంతా. అయితే తాజాగా అవన్నీ వదిలేసినట్లు మొన్నటి తిరుపతి వేడుకతో క్లారిటీ వచ్చేసింది. వేదికపై గల గల మాట్లాడటం..ఎవరూ అడగకుండానే పెళ్లి గురించి మాట్లాడటం....ఆదిపురుష్ టీమ్ గురించి పొగిడేయడం వంటి సన్నివేశాలు ప్రభాస్ లో సిగ్గరిని పక్కకు తరిమేసినట్లు కనిపిస్తుంది. మొహమాటం మర్చిపోయినట్లు కనిపించింది.
ఏడాదికి రెండు సినిమాలు కాదు..మూడు సినిమాలు చేస్తాను మీకోసం అంటూ అభిమానుల్ని ఉత్సాహ పరిచి మాట్లాడటం అన్ని డార్లింగ్ లో కొత్త కోణాన్ని చూపించాయి. ఏ వేదికపైనా డార్లింగ్ ఇంత ఓపెన్ గా మాట్లాడిందిలేదు.
చేతికి మైక్ ఇస్తే మూడు నిమిషాల్లో ముగించి వెళ్లిపోయేవారు. దీంతో డార్లింగ్ ఇలా మారిపోయాడేంటి? అంటూ మీడియా లో కథనాలు అంతే ఆసక్తికరం. మొత్తానికి ఆదిపురుష్ డార్లింగ్ లో చాలా మార్పులే తీసుకొచ్చిందని చెప్పొచ్చు.