Begin typing your search above and press return to search.

న‌ట‌వార‌సుల రంగంలో ప్ర‌భాస్ బ్ర‌ద‌ర్ రేసులో వెన‌క్కి?

By:  Tupaki Desk   |   20 March 2021 8:00 PM IST
న‌ట‌వార‌సుల రంగంలో ప్ర‌భాస్ బ్ర‌ద‌ర్ రేసులో వెన‌క్కి?
X
టాలీవుడ్ లో న‌ట‌వార‌సుల ప్ర‌వేశం నిరంత‌రం హాట్ టాపిక్‌. ఇటీవ‌లే ఉప్పెన సినిమాతో ప‌రిచ‌య‌మైన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఘ‌న‌మైన ఆరంగేట్రాన్ని చాటుకున్నాడు. చాలా మంది న‌ట‌వార‌సులు త‌డ‌బ‌డుతున్నా.. వైష్ణ‌వ్ గ్రాండ్ ఎంట్రీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డిన పెద్ద కుటుంబాల నుంచి న‌ట‌వార‌సులు ల‌క్ చెక్ చేసుకుంటున్నా చాలా మందికి ఆశించిన‌ది ద‌క్క‌డం లేదు. ఇక రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ప‌రిచ‌యమైన ఓ యువ‌హీరో గురించి మ‌రోసారి అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఒక సాధార‌ణ హీరోగా మొద‌లై పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. కానీ ఆ కుటుంబం నుంచే వ‌చ్చిన సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా రాణించ‌డంలో త‌డ‌బ‌డ్డారు.

సిద్దార్థ్ రాజ్ కుమార్ `కెర‌టం` చిత్రంతో హీరో అయ్యారు. ఇందులో పంజాబీ బ్యూటీ ర‌కుల్ హీరోయిన్.. ర‌కుల్ ఇప్పుడు పెద్ద హీరోయిన్.. సిద్ధార్థ్ మాత్రం రేసులో వెన‌క‌బ‌డ్డారు. ద్వితీయ ప్ర‌య‌త్నం క‌మ్ముల శిష్యుడితో `ఆ ఐదుగురు` అనే చిత్రం చేశారు. అందులో ఐదుగురిలో ఒక‌రిగా న‌టించారు. కానీ ఆ సినిమా త‌ర్వాత రాజ్ కుమార్ కెరీర్ పై స‌రైన‌ క్లారిటీ లేదు. కృష్ణంరాజు దర్శ‌క‌త్వంలో సినిమా కోసం చాలా కాలం స్క్రిప్టు ప‌నులు సాగాయి. కానీ త‌ర్వాత ఆ సినిమాకి సంబంధించిన స‌మాచారం ఏదీ లేదు.టాలీవుడ్ లో బ‌డా ఫ్యామిలీస్ నుంచి హీరోలు వ‌స్తున్నారు.. కొంద‌రు స‌క్సెస‌వుతున్నారు.. మ‌రికొంద‌రు ఫెయిల‌వుతున్నా తిరిగి ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ సిద్ధార్థ్ రాజ్ కుమార్ మాత్రం ఆ త‌ర్వాత ఏం చేస్తున్నారో క్లారిటీ రాలేదు.