Begin typing your search above and press return to search.

డిజే భామ జోరు తగ్గిందా ?

By:  Tupaki Desk   |   15 July 2019 11:15 AM IST
డిజే భామ జోరు తగ్గిందా ?
X
వరుణ్ తేజ్ ముకుందాతో పరిచయమై ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసంతో మొదటి రెండు సినిమాలకు ఆశించిన ఫలితం అందుకోలేక బాలీవుడ్ వెళ్ళిపోయిన పూజా హెగ్డే కొంత గ్యాప్ తో డిజే రూపంలో గొప్ప టర్నింగ్ తీసుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కి హరీష్ శంకర్ కు కలిగించిన ప్రయోజనం పెద్దగా లేదు కానీ పూజా బికినీ అందాలకు ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఇక అది మొదలు పూజాకు ఆఫర్ల వెల్లువ మొదలైంది.

గత ఏడాది అరవింద సమేత వీర రాఘవలో టైటిల్ లో సగం పేరున్న పాత్ర చేసినప్పటికీ క్రెడిట్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. కాకపోతే గ్లామర్ పరంగా తనకు ప్లస్ అయ్యింది. మహర్షి బ్లాక్ బస్టర్ అయినా అంతా మహేష్ నామస్మరణతోనే మోగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ చేస్తున్న పూజా వాల్మీకి చేయడం ఒకరకంగా సర్ప్రైజ్ అని చెప్పొచ్చు

ఇవి కాకుండా ప్రభాస్ తో రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా పూజా హెగ్డే ఖాతాలోనే ఉంది. డీజే తర్వాత పూజా చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది సాక్ష్యం సినిమా ఒప్పుకోవడమే. డిజాస్టర్ కావడంతో పాటు సాయి శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో చేయడం గురించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. వాటిని పక్కనపెడితే ఇప్పుడు పూజాకు అల్లు అర్జున్ ప్రభాస్ సినిమాలు పెద్ద హిట్ కావడం చాలా అవసరం.

ఇప్పుడున్న పొజిషన్ కాపాడుకోవాలన్నా డిమాండ్ స్టడీగా ఉండాలన్నా ఇది జరగాలి. అందుకే తొందరపడకుండా కథలను ఎంచుకుంటున్నట్టు టాక్. హిందీలో పూర్తి చేసిన హౌస్ ఫుల్ 4 విడుదలకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా పూజా కొత్తగా ఇంకా ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు. ఓ రెండు మూడు కథా చర్చల దశలోనే ఉన్నాయట.