Begin typing your search above and press return to search.

అపరిచితుడి పక్కన పూజాని పెడతారా ?

By:  Tupaki Desk   |   16 May 2019 11:09 AM IST
అపరిచితుడి పక్కన పూజాని పెడతారా ?
X
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరొయిన్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. రెండో పేరు చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది మరి. జూనియర్ ఎన్టీఆర్-మహేష్ బాబు-ప్రభాస్-అల్లు అర్జున్ ఇలా వరసబెట్టి టాప్ స్టార్స్ అందరూ ఏరికోరి మరీ తనే కావాలి అంటున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్ వాల్మికిలో పూజా హెగ్డే ఉంటుందని ఒకసారి లేదు రెమ్యునరేషన్ విషయంలో ఏదో ఇష్యూ ఉండటం వల్ల చేయడం లేదని మరోసారి ఇలా రకరకాల ప్రచారం జరిగింది.

దర్శకుడు హరీష్ శంకర్ నేను చెప్పే దాకా ఏది నమ్మకండి అని చెప్పాడు కాని నిప్పు లేనిదే పొగ రాదు తరహాలో దీని తాలుకు అప్ డేట్స్ మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన మరొకటి వచ్చి చేరింది. దాని ప్రకారం పూజా హెగ్డేని వాల్మికి కోసం ప్రతిపాదించింది నిజమే కాని కథ ప్రకారం అది వరుణ్ తేజ్ కోసం కాదట. ఇందులో హీరో లాంటి మరో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటుడు అధర్వాకు జోడిగా. ఇది నిజంగా షాక్ ఇచ్చే న్యూసే.

అధర్వా మనవాళ్ళకు పూర్తిగా అపరిచితుడు. ఆంజలి సిబిఐలో కనిపించాడు కాని సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరికి గుర్తు లేదు. ఇప్పుడు పూజాను తన సరసన వాడుకోవడం అంటే ప్రేక్షకులు ఆమోదిస్తారా అనే ప్రశ్న మెదులుతుంది. జిగర్ తండా రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ చాలా మార్పులు చేసినట్టుగా యూనిట్ చెబుతోంది. ఇంతకీ పూజా పాత్రకు సంబంధించిన క్లారిటీ అసలు తను ఉందా లేదా అనే సమాచారం టీం అఫీషియల్ గా చెప్పే దాకా వీటికి అడ్డుకట్ట పడేలా లేదు