Begin typing your search above and press return to search.

డార్లింగ్ కి అమ్మడు సంగీత పాఠాలు చెప్పబోతోందా...?

By:  Tupaki Desk   |   5 May 2020 10:30 AM IST
డార్లింగ్ కి అమ్మడు సంగీత పాఠాలు చెప్పబోతోందా...?
X
'డార్లింగ్' ప్రభాస్ - పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1970 కాలానికి సంబంధించిన ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్రకి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది.


అదేంటంటే ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ ని పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్ - పూజాహెడ్గేల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.