Begin typing your search above and press return to search.

పంజాబీ ఇండ‌స్ట్రీకి బౌన్స్ బ్యాక్ అవుతోందా?

By:  Tupaki Desk   |   20 April 2021 4:30 PM GMT
పంజాబీ ఇండ‌స్ట్రీకి బౌన్స్ బ్యాక్ అవుతోందా?
X
తెలుగు-త‌మిళంలో వ‌రుస అవ‌కాశాల కోసం చాలానే ప్ర‌యత్నించింది పాయ‌ల్ రాజ్ పుత్. కానీ ఇక్క‌డ కెరీర్ ఆశించినంత స్పీడ్ లేదు. దీంతో పాయ‌ల్ తిరిగి పంజాబీ ఇండ‌స్ట్రీకి రిట‌న్ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

తాజాగా పాయ‌ల్ గిప్పీ గ్రేవాల్ అనే పంజాబీ హీరో స‌ర‌స‌న కొత్త సినిమాకి క‌మిటైంది. సూప‌ర్ ఎగ్జ‌యిటెడ్ అంటూ క్లాప్ కొడుతున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే హీరోతో ఉన్న మ‌రో ఫోటోని పాయ‌ల్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

నా ఆల్ టైమ్ ఫేవ‌రెట్ హీరో గిప్పీతో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది అంటూ ఎగ్జ‌యిట్ అయ్యింది పాయ‌ల్. షావ‌ని గిరిధ‌రిలాల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాయ‌ల్ షేర్ చేసిన ఈ కొత్త‌ విష‌యం విన్న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. శుభాకాంక్ష‌లు స్వీటీ అంటూ ఒక‌రు కంగ్రాట్స్ బేబ్ అంటూ ఇంకొక అభిమాని విష్ చేశారు.

పాయ‌ల్ ప్ర‌స్తుతం తెలుగులో ఆర్.ఎక్స్ 100 ద‌ర్శ‌కుడితోనే ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారని క‌థ‌నాలొచ్చాయి. క‌రోనా వ‌ల్ల‌ త‌మిళ చిత్రం ఏంజెల్ రిలీజ్ వాయిదా ప‌డుతూనే ఉంది. తెలుగులో మ‌రో కొత్త‌ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ లేదు. ఆర్.ఎక్స్ 100- వెంకీ మామ లాంటి హిట్లు ఉన్నా పాయ‌ల్ కి ఎందుక‌నో ఇక్క‌డ స‌రైన ఆఫ‌ర్లు రావ‌డం లేదు.