Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ కు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసిందా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 6:30 AM GMT
ప‌వ‌ర్ స్టార్ కు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసిందా?
X
టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ శైలి ప్ర‌త్యేకం. అందుకే ఆయ‌న సినిమాల‌ని ప‌క్కన పెట్టి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతానంటే ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. రాజ‌కీయాల్లోకి వెళ్లినా సినిమాల్లో కంటిన్యూ కావాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమాని వీడటానికి వీళ్లేద‌నిప‌ట్ట‌బ‌ట్టారు. వారి విన్న‌పాలు విన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు మూడున్న‌రేళ్ల త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టారు.

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్‌' ఆధారంగా తెర‌కెక్కిన 'వకీల్ సాబ్'తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌రువాత కూడా రీమేక్ మూవీ 'భీమ్లానాయ‌క్‌'లో న‌టించారు. అయితే ఈ రెండు సినిమాల త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల విష‌యంలో క్లారిటీ మిస్స‌వుతోంది. కోవిడ్ కి ముందు క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ష‌న్ లో మొద‌లు పెట్టిన పీరియాడిక్ మూవీ 'హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు' షూటింగ్ గ‌త కొంత కాలంగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది.

ఇక ప‌వ‌న్ తో హ‌రీష్ శంక‌ర్ చేయాల‌ని అనౌన్స్ చేసిన 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ' షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కె తెలియ‌ని అయోమ‌య స్థితి నెల‌కొంది. ఇదిలా వుంటే స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ ని లాగించేస్తున్నారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో ప‌వ‌న్ ఫుల్ బిజీగా వుండ‌టం, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీ పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగా ప‌వన్ క‌ల్యాణ్ సినిమాల‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్ట‌లేక‌పోతున్నారు.

దీంతో ప‌వ‌న్ కల్యాణ్ తో సినిమాలు చేయాల‌నుకున్న వాళ్ల‌లో తీవ్ర గంద‌ర‌గోళం మొదలైంది. ఏ సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో.. ఉ ప్రాజెక్ట్ కు ప‌వ‌న్ ఫుల్ డేట్స్ కేటాయిస్తాడో క్లారిటీ లేక‌పోవ‌డంతో 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'తో పాటు మ‌రో రెండు రీమేక్‌, హ‌రీష్ శంక‌ర్ మూవీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. రాజ‌కీయాల్లో బిజీగా వుండ‌టం వ‌ల్లే ప‌వ‌న్ సినిమాల‌కు డేట్స్ కేటాయించ‌లేక‌పోతున్నార‌న్న‌ది తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫుల్ క్లారిటీ తో ప‌క్కా ప్లాన్ ని సెట్ చేసుకున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ ని వీలు చిక్కిన‌ప్పుడు చేస్తూ వెళుతున్న ప‌వ‌న్ తాజాగా షూటింగ్ ని ఫినిష్ చేసే విష‌యంలో ఫుల్ క్లారిటీకి వ‌చ్చేశార‌ట‌.

గ‌త కొంత కాలంగా ఆగుతూ సాగుతూ వెళుతున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'ని పూర్తి చేశాకే మిగ‌తా ప‌నుల‌పై దృష్టి పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశాడ‌ట ప‌వ‌న్‌. అంతే అనుకున్న టైమ్ కి హ‌రి హ‌ర రావ‌డంఖాయ‌న్న‌మాట‌.. ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పండ‌టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.