Begin typing your search above and press return to search.

జనవరి 8న 'పాన్ ఇండియా మూవీ' టీజర్ రాబోతుందా..??

By:  Tupaki Desk   |   28 Dec 2020 6:45 AM GMT
జనవరి 8న పాన్ ఇండియా మూవీ టీజర్ రాబోతుందా..??
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులను కళ్లప్పగించి ఎదురుచూసేలా చేస్తున్నాయి పాన్ ఇండియా సినిమాలు. అందులో ఒకటి కోలార్ గోల్డ్ ఫీల్డ్.. అదే కేజీఎఫ్. కేజీఎఫ్ చాప్టర్-1 పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఒక డెబ్యూ హీరో సినిమా విడుదలైన అన్ని బాషలలో సూపర్ హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. కేజీఎఫ్ ఒక్క సినిమా కన్నడ హీరో యష్ లైఫ్ మార్చేసింది. ఆ సినిమాకి ముందు యష్ కేవలం కన్నడ హీరో.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. అయితే కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తున్న కేజీఎఫ్-2 కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానుల నోరు మూయించిన కేజీఎఫ్ మేకర్స్.. త్వరలో టీజర్ విడుదల చేస్తే బాగుంటుందని దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే జనవరి 8న హీరో యష్ పుట్టినరోజు ఉండటంతో ఏదైనా సర్ప్రైజ్ ఉండబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నాయి సినీవర్గాలు. ఇదివరకు గ్లింప్స్ లో చెప్పినట్లుగా ఆ సర్ప్రైజ్ టీజర్ అయితేనే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి వాతావరణం చూస్తుంటే కేజీఎఫ్ మేకర్స్ అదే టీజర్ రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. కానీ టీజర్ ఏ భాషలో విడుదల చేయబోతున్నారు అనే దానిపై ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. జనవరి 8 రోజునే అన్ని బాషల టీజర్స్ విడుదల చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. లేదు ఒక భాషలో మాత్రమే అయితే మిగతా భాషల ఫ్యాన్స్ కి నిరాశే మిగులుతుంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నాడు. చూడాలి మరి కేజీఎఫ్ చాప్టర్-2 నుండి ఎలాంటి సర్ప్రైజ్ రానుందో..!!