Begin typing your search above and press return to search.

జూలీ-2కు ఎవరి కథో తెలిసిపోయింది

By:  Tupaki Desk   |   20 Nov 2017 9:49 AM GMT
జూలీ-2కు ఎవరి కథో తెలిసిపోయింది
X
సౌత్ ఇండియన్ హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘జూలీ-2’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇది ‘డర్టీపిక్చర్’ తరహాలో ఒక నటి నిజ జీవిత కథతో తెరకెక్కిన సినిమా అని స్వయంగా చిత్ర బృందమే ప్రకటించింది. చిత్ర సమర్పకుడు ప్రహ్లాద్ నిహ్లాని ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కానీ ఆ నటి ఎవరన్నది తాను చెప్పనని.. అలా చెబితే తమ సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని అతనన్నాడు.

ఐతే ఈ చిత్ర బృందం ఇస్తున్న హింట్ల ప్రకారం చూస్తే ఆ నటి ఎవరో కనిపెట్టడం కష్టం కాదు. ఖాన్ త్రయంలో ఒక హీరో సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత దక్షిణాదిన కథానాయికగా మంచి అవకాశాలు అందుకుని, స్టార్ అయ్యాక.. చివరగా భోజ్ పురి సినిమాల్లోనూ ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కథ ఇదట. ఆ హీరోయిన్ సౌత్ లో ఒక స్టార్ హీరోతో ఎఫైర్ కూడా నడిపిందట. ఈ హింట్స్ అన్నీ కలిపి చూస్తే.. ఆ హీరోయిన్ నగ్మానే అని స్పష్టమవుతోంది. ఆమె సల్మాన్ మూవీ ‘బాగి’తో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత దక్షిణాదిన స్టార్ అయింది. ఆపై భోజ్ పురి సినిమాల్లోనూ నటించింది. ఆమె తమిళ స్టార్ శరత్ కుమార్ తో ఎఫైర్ నడిపినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఐతే ‘జూలీ-2’ సినిమాలో హీరోయిన్ పాత్ర చూస్తే నగ్మా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చని తెలుస్తోంది. ఆలోపు నగ్మా పేరు పాపులరైతే మాత్రం ఆమెకు ఇబ్బందేనేమో.