Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 టైటిల్‌.. బండ్లన్నతో లింక్‌!

By:  Tupaki Desk   |   12 Nov 2022 9:30 AM GMT
ఎన్టీఆర్‌ 30 టైటిల్‌.. బండ్లన్నతో లింక్‌!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆచార్య ఫెయిల్యూర్ కారణంగా ఎన్టీఆర్‌30 సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ 30 గురించి కొత్త పుకారు షికారు చేస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమా యొక్క టైటిల్ ను బండ్ల గణేష్ నుండి తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్‌ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా తనకు దేవుడు పవన్ కళ్యాణ్ అని... తన దేవర పవన్ కళ్యాణ్ అంటూ పదే పదే వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్ తో దేవర అనే సినిమాను చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. ఆ టైటిల్‌ ను బండ్ల గణేష్‌ రిజిస్ట్రర్ చేయించాడనే వార్తలు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవలే స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది అన్నట్లుగా తెలియజేసేందుకు దర్శకుడు కొరటాల శివ కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఆ ఫోటోలతో సినిమా గురించి ఉన్న పుకార్లకు బ్రేక్ పడ్డట్టు అయ్యింది.

ఎన్టీఆర్‌ 30 సినిమాకు ఇప్పుడు బండ్ల గణేష్ రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా ప్రచారం జరిగిన 'దేవర' టైటిల్‌ ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జోరుగా ఇదే విషయం తెగ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ 30 కథకు తగ్గట్లుగా పాన్ ఇండియా స్థాయిలో అందరికి రీచ్ అయ్యే విధంగా దేవర టైటిల్ ను ఓకే చేశారని.. ఎన్టీఆర్ కోసం బండ్లన్న ఆ టైటిల్‌ ను ఇచ్చేందుకు ఓకే అన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 కోసం కథ సిద్దం అయ్యిందట.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. దేవర టైటిల్ కన్ఫర్మ్‌ అయితే అభిమానులకు పండగే అనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.