Begin typing your search above and press return to search.

బింబిసారుడి సాక్షిగా ఎన్టీఆర్ అన్నింటికి క్లారిటి ఇవ్వ‌బోతున్నాడా?

By:  Tupaki Desk   |   28 July 2022 6:31 AM GMT
బింబిసారుడి సాక్షిగా ఎన్టీఆర్ అన్నింటికి క్లారిటి ఇవ్వ‌బోతున్నాడా?
X
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'బింబిసార‌'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో హారి కృష్ణ నిర్మించారు. 5 వ శ‌తాబ్దానికి చెందిన మ‌గ‌ధ లోని త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాధినేత బింబిసారుడికి నేటి కాలానికి వున్న సంబంధం ఏంటి? అనే నేప‌థ్యంలో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా ద్వారా మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఇందులో క‌ల్యాణ్ రామ్ కు జోడీగా ముగ్గురు క‌థానాయిక‌లు క‌నిపించ‌బోతున్నారు. కేథ‌రిన్‌, సంయుక్త మీన‌న్‌, వరీనా హుస్సేన్ హీరోయిన్ లుగా న‌టించారు. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎట్రాక్ట్ చేస్తూ వ‌స్తోంది.

టీజ‌ర్ ని కూడా ఇటీవ‌లే విడుద‌ల చేశారు. తాజాగా సినిమా రిలీజ్ కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ట్రైల‌ర్ ని క‌ల్యాణ్ రామ్ సోద‌రుడు, స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. బింబిసారుడి ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తూనే ఈ ట్రైల‌ర్ లో క‌ల్యాణ్ రామ్ మ‌రో పాత్ర‌ని కూడా చూపించిన విష‌యం తెలిసిందే.

ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు, అబ్బుర ప‌రిచే పోరాట ఘ‌ట్టాల‌తో ఆద్యంతం ప‌వ‌ర్ ఫుల్ గా ట్రైల‌ర్ సాగింది. విజువ‌ల్స్ కూడా హై స్టాండర్డ్స్ లో వున్నాయి. హీరో క‌ల్యాణ్ రామ్ కూడా సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఆగ‌స్టు 5న ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని జూలై 29న శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వహించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన‌బోతున్నారు.

బింబిసారుడి ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌లు అంశాల‌పై క్లారిటీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. గ‌త‌ కొన్ని రోజులుగా ఎన్టీఆర్ - కొర‌టాల శివ ప్రాజెక్ట్ పై ర‌క ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. 'RRR' త‌రువాత మీడియా ముందుకు రాని ఎన్టీఆర్ త‌న 30వ ప్రాజెక్ట్ తో పాటు ప్ర‌శాంత్ నీల్ మూవీ, బుచ్చిబాబు తో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర వివ‌రాల‌పై క్లారిటీ ఇచ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ నుంచి ఈ అంశాల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ట‌. కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతుండ‌టానికి గ‌ల కార‌ణాలు ఏంటీ? మేకోవ‌ర్ కోస‌మే ఆల‌స్యం అవుతోందా? లేక 'ఆచార్య‌' వ‌ల్ల ఏర్ప‌డిన ఇబ్బందుల కార‌ణంగా ఈ మూవీ ప్రారంభానికి అవ‌రోధాలు ఎదుర‌వుతున్నాయ‌నే విష‌యాల‌పై ఎన్టీఆర్ 'బింబిసార‌' ప్రీ రిలీజ్ సాక్షిగా క్లారిటీ ఇచ్చే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఎన్టీఆర్ ఎలా స్పందించ‌బోతున్న‌డ‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు ఎదురుచూడాల్సిందే.