Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ మొదటి సినిమా అది కాదా?

By:  Tupaki Desk   |   28 July 2021 5:00 AM GMT
మోక్షజ్ఞ మొదటి సినిమా అది కాదా?
X
నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఖచ్చితంగా ఉండేలా ఉంది. ఈ ఏడాదిలోనే సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ సమాచారం అందుతోంది. బాలకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మరియు మోక్షజ్ఞ కలిసి ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌ లో నటించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ ప్రకటనతో మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్యతో ఉంటుందని అంతా అనుకున్నారు. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాలు మరియు నందమూరి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమాలో సోలో హీరోగానే కనిపించబోతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇప్పటికే పలు కథలను మరియు దర్శకులను మోక్షజ్ఞ కోసం రెడీ చేసి పెట్టాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫిజిక్ పై దృష్టి పెట్టడంతో పాటు డాన్స్ లు మరియు మార్షల్ ఆర్ట్స్ పై కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఒకటి రెండు నెలల్లో మోక్షజ్ఞ మొదటి సినిమా ను అధికారికంగా ప్రకటించబోతున్నారు అంటున్నారు. మొదటగా ప్రముఖ సీనియర్‌ దర్శకుడితో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది. ఆ సినిమాను ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించబోతున్నారు. ఇక తదుపరి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించేందుకు ఇప్పటికే సిద్దం అయ్యారు.

బాలకృష్ణ ద్వారా మోక్షజ్ఞ డేట్లు కూడా వారు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనే విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాని వచ్చే ఏడాది నందమూరి అభిమానుల కోసం మోక్షజ్ఞ సినిమా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మాత్రం ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బాలకృష్ణ తాను అనుకుంటున్న ఆదిత్య 369 సినిమా ను మోక్షజ్ఞ హీరోగా కాస్త గుర్తింపు దక్కించుకుని కొన్నాళ్లు సెటిల్‌ అయిన తర్వాత మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి మోక్షజ్ఞ మొదటి సినిమా అప్‌ డేట్ రాబోయే రెండు నెలల్లో ఏ క్షణంలో అయినా రావచ్చు అని నందమూరి అభిమానులకు హింట్ అందుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వారు ఎదురు చూస్తున్నారు. కనుక ఆయన ఎంట్రీ ఖచ్చితంగా అభిమానులకు ఆనందంను కలిగిస్తుంది.

మోక్షజ్ఞ సినిమాల ఎంపిక విషయంతో పాటు ఆయన ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమద్య కాస్త ఎక్కువ వెయిట్ తో కనిపించిన నందమూరి ప్రిన్స్ ప్రస్తుతం చాలా స్లిమ్ అయ్యాడని కూడా కొందరు అంటున్నారు. కాని ఈమద్య కాలంలో మోక్షజ్ఞ బయట కనిపించిందే లేదు. కనుక ఆయన ఎలా ఉన్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ లుక్‌ తో పాటు ఆయన్ను వెండి తెరపైనే చూస్తాము కావచ్చు.