Begin typing your search above and press return to search.

నాని తరువాత నితిన్ లైన్ లో ఉన్నాడా..?

By:  Tupaki Desk   |   19 Aug 2020 10:30 AM IST
నాని తరువాత నితిన్ లైన్ లో ఉన్నాడా..?
X
ఓటీటీ అంటే చిన్న‌చూపు ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారుతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ప‌ట్టుబ‌ట్టిన చాలా మంది హీరోలు ఇన్నాళ్లు నిర్మాత‌ల్ని వెయిట్ చేయించారు. కానీ ఇక ఎవ‌రూ దేనికీ అడ్డు చెప్పే ప‌రిస్థితి లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌హ‌మ్మారీ క్రైసిస్ అంత‌కంత‌కు పెరుగుతుంటే అంద‌రిలోనూ మార్పొచ్చింది. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన‌ డ‌జ‌ను పైగా తెలుగు సినిమాలు ల్యాబుల్లో నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసుకుని మ‌గ్గుతున్నాయి. వాట‌న్నిటినీ ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేసేందుకు ఓటీటీల‌తో బేర‌సారాలు సాగిస్తున్నారు. డీల్ కుదిరితే డైరెక్ట్ ఓటీటీనే.

ఈ సీజ‌న్ లో ఓటీటీలోకి రాబోతున్న తొలి క్రేజీ మూవీ ఏది? అంటే.. నాని-సుధీర్ బాబు న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ `వి`. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వనుంద‌ని స‌మాచారం. ఈ సినిమా కి జనాలు నుంచి వచ్చే స్పందన చాలా ఇంపార్టెంట్. అది చూసి దిల్ రాజు ఈ సినిమాను అమెజాన్ కి అమ్మి ఎంత లాభం పొందాడో చూసుకొని నితిన్ అప్ కమింగ్ మూవీ `రంగ్ దే` ని కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. `వి` రిజ‌ల్ట్ భ‌రోసానిస్తే రంగ్ దే తో పాటు వ‌రుస‌గా ప‌లు క్రేజీ సినిమాలు ఓటీటీల్లో రిలీజైపోవ‌డం ఖాయంగా చెబుతున్నారు.

ఇప్పటికే హారిక హాసిని- సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ వాళ్లు చాలా సినిమాలు లైనప్ లో పెట్టుకోవడంతో ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిళ్లు పెరిగాయి. ఇవేగాక‌ చాలా విషయాలు నితిన్ `రంగ్ దే` ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు నిర్ణయం తీసుకునేలా చేసిందని తెల్సింది. ఈ బ్యాన‌ర్ల‌లో ఓవైపు అగ్ర హీరోల‌తో సినిమాలు మ‌రోవైపు న‌వ‌త‌రం హీరోలతో రీమేక్ సినిమాల‌కు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.