Begin typing your search above and press return to search.

నితిన్ కూడా సోషల్‌ మెసేజ్ ఇవ్వబోతున్నాడా?

By:  Tupaki Desk   |   11 Sep 2021 3:57 AM GMT
నితిన్ కూడా సోషల్‌ మెసేజ్ ఇవ్వబోతున్నాడా?
X
యంగ్‌ హీరో నితిన్ వినాయక చవితి సందర్బంగా తన 31వ సినిమా ను ప్రకటించాడు. పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడంతో పాటు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాకు గాను 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఎడిటర్ శేఖర్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారు. నితిన్‌ హోం బ్యానర్‌ లో నిర్మాణం జరుగబోతున్న ఈ సినిమా చాలా స్పెషల్‌ కథతో రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ అత్యంత పవర్ ఫుల్ గా ఉంటాడని తెలుస్తోంది.

ఈమద్య కాలంలో నితిన్‌ సినిమాల్లో విలన్‌ ను ఇంత పవర్ ఫుల్‌ గా చూడలేదని.. ఖచ్చితంగా విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. నితిన్‌ ఈ సినిమా లో ప్రభుత్వ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనేది మీడియా వర్గాల టాక్‌. సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈమద్య కాలంలో చెక్‌.. రంగ్‌ దే మరియు మాస్ట్రో సినిమాలను చేశాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాను మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్‌ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా లో మంచి సోషల్‌ మెసేజ్ ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా లో క్యూట్ లవ్‌ స్టోరీ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈమద్య కాలంలో సోషల్‌ మెసేజ్ సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. అందుకే ఈ సినిమా కు కూడా తప్పకుండా మంచి మార్కులు దక్కుతాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. నితిన్‌ 31వ సినిమా గా రూపొందబోతున్న ఈ సినిమాకు ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.