Begin typing your search above and press return to search.

నాని సినిమా అంత బిజినెస్ చేస్తోందా..?

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:00 PM IST
నాని సినిమా అంత బిజినెస్ చేస్తోందా..?
X
నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని కి జోడీగా రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌ లో జరుగుతోంది. నాని కెరీర్ లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

'నిన్నుకోరి' వంటి సూపర్ హిట్ సినిమా త‌ర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే 'టక్ జగదీష్' ని ఓ ప్రముఖ నిర్మాత సుమారు 45 కోట్లకు తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా నాని 'వి' సినిమా రిజల్ట్ తర్వాత కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్‌. థమన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వర్క్ చేస్తుండగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.