Begin typing your search above and press return to search.

నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారా..?

By:  Tupaki Desk   |   23 March 2021 8:00 AM IST
నాని కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారా..?
X
నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారి 'అ!' 'హిట్‌' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'హిట్‌' చిత్రానికి కొనసాగింపుగా ''హిట్‌ 2'' ని స్టార్ట్ చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ రెండో భాగం రూపొందుతోంది. అయితే ఫస్ట్ భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. ఇప్పుడీ రెండో భాగంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్‌ నటిస్తున్నారు. ఇందులో హిట్‌ (హొమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో శేష్ కనిపిస్తారు. అయితే నాని ఈ ప్రాజెక్ట్ లోకి శేష్ ని తీసుకోవడం వెనుక మంచి బిజినెస్ మైండ్ ఉందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

అడవి శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిట్ అయితే శేష్ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ తెచ్చుకుంటాడు. దాని తర్వాత వచ్చే 'హిట్ 2' సినిమా బిజినెస్ కూడా పాన్ ఇండియా స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు డిజిటల్ - శాటిలైట్ రైట్స్ కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఏ విధంగా చూసినా 'హిట్ 2' ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనే అనుకోవాలి. నాని ఇలాంటివన్నీ లెక్కలోకి వేసుకునే శేష్ ని సెకండ్ పార్ట్ లోకి తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

ఇదిలావుండగా 'హిట్ 2-ది సెకండ్‌ కేస్‌' సినిమా రెగ్యులర్ షూటింగ్ అడవి శేష్ 'మేజర్' షూట్ అయ్యాక స్టార్ట్ కానుంది. ఇందులో మీనాక్షి చౌదరి - కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటించనున్నారు. జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సమకూరుస్తుండగా.. మణికందన్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.