Begin typing your search above and press return to search.

'బింబిసార'గా నందమూరి హీరో రిస్క్ చేస్తున్నాడా..??

By:  Tupaki Desk   |   29 May 2021 6:30 AM GMT
బింబిసారగా నందమూరి హీరో రిస్క్ చేస్తున్నాడా..??
X
ప్రస్తుతం సక్సెస్ బాటలో లేని నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. కొంతకాలంగా వరుస ప్లాప్ మూవీస్ ఎదుర్కొంటున్నాడు. గతంలో పటాస్, 118 సినిమాలతో హిట్స్ పడినప్పటికి.. అంతకు ముందు ఆ తర్వాత చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వచ్చాయి. కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన 'ఎంతమంచి వాడవురా' సినిమా కూడా ప్లాప్ గా కావడం నిరాశపరిచే విషయం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన ఆలోచనలో ఉన్నాడు. అందుకోసం ఈ లాక్డౌన్ లో పలు స్టోరీ లైన్స్ విని నచ్చిన సినిమాలను లైనప్ చేస్తున్నాడు. లాక్డౌన్ లో కొంతమంది దర్శకుల కథలను విన్నాడట. ఇకపై తదుపరి సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ జాగ్రత్తపడుతున్నాడు. ఇటీవలే రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ స్టోరీని ఓకే చేసాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు ద్విపాత్రభినయం చేసాడు కానీ త్రిపాత్రభినయం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండేళ్ల కిందటే కళ్యాణ్ రామ్ మరో డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కథను ఓకే చేసాడు. 2019లో ఓకే చేసిన ఈ సినిమా తాజాగా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సోషియో ఫాంటసీ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట్ చెప్పిన స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉందని.. కేవలం సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయిందని సమాచారం. అయితే ఈ సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమాకు 'బింబిసార' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే కళ్యాణ్ రామ్ బింబిసార అనే కింగ్ క్యారెక్టర్లో యుద్ధం నేపథ్యంలో సినిమా రూపొందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ బింబిసారలో కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ లుక్కులో దర్శనమిచ్చాడు. అయితే బింబిసార అనేది టైం ట్రావెలింగ్ జానర్ కాబట్టి ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమాను పోలి ఉండబోతుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. అప్పట్లో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కి ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మరి అలాంటి నేపథ్యంలో ఎంచుకున్నాడు కాబట్టి కళ్యాణ్ రామ్ టీమ్ ఎలాంటి న్యాయం చేస్తారో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆ నిరీక్షణకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు.