Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని ఫాలో అవుతున్న నాగార్జున‌!

By:  Tupaki Desk   |   24 Nov 2022 8:30 AM GMT
మెగాస్టార్ ని ఫాలో అవుతున్న నాగార్జున‌!
X
తెలుగు స్టార్స్ గ‌త కొంత కాలంగా మ‌ల‌యాళ రీమేక్ ల‌పై ఆధారప‌డుతున్నారు. అక్క‌డ సూప‌ర్ హిట్ అయిన సినిమాల‌ని తెలుగులో రీమేక్ చేస్తూ విజ‌యాల్ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ విష‌యంలో కొంత మంది స‌క్సెస్ అవుతుంటే మ‌రి కొంత మంది యావ‌రేజ్ హిట్ తో స‌రిపెట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ 'భీమ్లానాయ‌క్‌'ని మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' ఆధారంగా చేసిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే ఇదే త‌ర‌హాలో మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాద‌ర్‌' మూవీని చేసిన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ స్థాయిలో కూడా ఈ మూవీ స‌క్సెస్ ని సొంతం చేసుకోలేక‌పోయింది. స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించినా ఈ మూవీని కాపాడ‌లేక‌పోయారు. దీంతో రీమేక్ ల‌కు ఇక కాలం చెల్లిన‌ట్టేన‌నే కామెంట్ లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల‌కు షాకిస్తూ మ‌రో స్టార్ మ‌ల‌యాళ రీమేక్ నే న‌మ్ముకోవ‌డం గ‌మ‌నార్హం.

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే మ‌రో సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున కూడా మ‌ల‌యాళ రీమేక్ పై క‌న్నేయ‌డం విశేషం. ఇటీవ‌ల స్ట్రెయిట్ స్టోరీస్ తో నాగ్ చేసిన 'వైల్డ్‌ డాగ్ ', 'ది ఘోస్ట్‌' సినిమాలు భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై తీవ్ర నిరాశ‌కు గురి చేశాయి.

దీంతో నాగ్ రీమేక్ సినిమా అయితే బెట‌ర్ అని ఓ మ‌ల‌యాళ సినిమాపై క‌న్నేశాడ‌ని తెలిసింది. 'పోరింజు మ‌రిమ‌మ్ జోస్‌'. జోజు జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌లో జోషీ రూపొందించిన ఈ మూవీ ఇది.

తెలుగులో కృష్ణంరాజుతో 'అంతిమ తీర్పు' వంటి సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన జోషీ ఈ మూవీని రూపొందించారు. 2019లో విడుద‌లైన ఈ సినిమా అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని చూసిన నాగార్జున ఇంప్రెస్ అయ్యార‌ట‌. దీన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్రినాథ‌రావు న‌క్కిన రూపొందించిన ప‌లు సినిమాల‌కు రైట‌ర్ గా వ్యవ‌హ‌రిస్తూ వ‌స్తున్న ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఈ రీమేక్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.

ఈ రీమేక్ మూవీని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి నిర్మించ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల రామ్ తో 'ది వారియ‌ర్‌' నిర్మించి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య తో 'క‌స్ట‌డీ' మూవీల‌ని అందిస్తున్న శ్రీ‌నివాస చిట్టూరి ఈ రీమేక్ ని నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.