Begin typing your search above and press return to search.
నాగబాబు బొంబాయి వెళ్తున్నారా? లేదా?
By: Tupaki Desk | 5 April 2021 7:00 AM ISTమెగాస్టార్ సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగబాబు.. చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ.. ప్రత్యేక, అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు.
అయితే.. మెగా బ్రదర్ నాగబాబుకు సంబంధించిన ఓ ఫొటో ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ముఖానికి కత్తిగాట్లతో, కరకు వ్యక్తిలా ఉన్న ఆ పిక్ అందరినీ ఆకర్షించింది. ఈ ఫొటో దేనికి సంబంధించినది అయి ఉంటుందని ఆరాతీస్తే.. బాలీవుడ్ మూవీకి సంబంధించిందనే వార్తలు వచ్చాయి.
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో 2005లో వచ్చిన ఛత్రపతి సినిమాను.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా బ్రదర్ విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటికీ అది ప్రచారంగానే మిగిలిపోయింది.
నిజంగా నాగబాబు ఆ సినిమాలో నటిస్తున్నారా? లేదా? అనేది మాత్రం తెలియలేదు. దీనిపై యూనిట్ అధికారికంగా స్పందిస్తే తప్ప, విషయం తెలిసే అవకాశం లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కొంత గ్యాప్ తీసుకున్న వినాయక్.. బాలీవుడ్లో మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.